వణికిస్తున్న వరుస భూకంపాలు

ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. ఇదే సమయంలో ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో వరుస భూకంపాలు భయబ్రాంతులకు..

వణికిస్తున్న వరుస భూకంపాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 05, 2020 | 11:32 PM

ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. ఇదే సమయంలో ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో వరుస భూకంపాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు, నేపాల్‌, ఆఫ్ఘన్‌, కజకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా.. నేపాల్‌లో బుధవారం నాడు భూకంపం సంభవించింది. లలిత్‌ పూర్‌ జిల్లాలోని బాగల్‌ముఖీ ప్రాంతంలో భూ ప్రకంపనలు వణికించాయి. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇక ఆస్ట్రేలియా దేశానికి సమీపంలో ఉన్న వనౌటూ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది. నార్త్‌ పోర్ట్ విలాకు 187 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టార్ స్కేల్‌ భూకంప తీవ్రత 6.2 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్‌ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లనట్లు సమాచారం.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు