“ఆ మ్యాచ్​ తర్వాత గుక్కెట్టి ఏడ్చేశా”

భార‌త‌ పేసర్​ ఇషాంత్​ శర్మ వన్డే క్రికెట్​లో తిరిగి ఆడాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ​ జట్టులోనూ ప్రాతినిథ్యం వ‌హించాల‌ని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:57 pm, Wed, 5 August 20
"ఆ మ్యాచ్​ తర్వాత గుక్కెట్టి ఏడ్చేశా"

Ishant Sharma Life Turning point : భార‌త‌ పేసర్​ ఇషాంత్​ శర్మ వన్డే క్రికెట్​లో తిరిగి ఆడాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ​ జట్టులోనూ ప్రాతినిథ్యం వ‌హించాల‌ని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఇంట్ర‌స్టింగ్ విషయాలు పంచుకున్నాడు ఇషాంత్.

ఇషాంత్​ వివిధ‌ కారణాల వల్ల 2011, 2015, 2019 వ‌ర‌ల్డ్ క‌ప్స్​ ఆడలేకపోయాడు. “నాకు ప్ర‌పంచ‌​ కప్​లో ఆడటమంటే చాలా ఇష్టం. నిజానికి ఆ జట్టులో భాగం అవ్వాల‌నుకుంటున్నా” అని ఇషాంత్​ తెలిపాడు. ఈ క్రమంలోనే 2013లో మొహాలీలో జరిగిన వన్డేను గుర్తు చేసుకుంటూ.. ఆ మ్యాచ్​ తన జీవితంలో ట‌ర్నింగ్ పాయింట్ అని తెలిపాడు.

“2013 మొహాలీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో జేమ్స్​ ఫాల్క్​నర్​ నా బౌలింగ్​లో ఒక్క ఓవర్లోనే 30 రన్స్ చేసి.. ఆస్ట్రేలియాను గెలిపించాడు. అదే నా జీవితాన్ని చీక‌ట్లోకి నెట్టింది. నా దేశానికి నేను ద్రోహం చేసినట్లు ఫీల్ అయ్యాను. దాంతో రెండు, మూడు వారాల పాటు ఎవ్వరితో మాట్లాడాల‌నిపించ‌లేదు. నేను మగవాడ్ని అయినా కూడా.. నా గర్ల్​ఫ్రెండ్​కు ఫోన్​ చేసి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. తిన‌డం కూడా లేదు. టీవీలో నాపై వచ్చే విమర్శలు చూసి నిద్ర ప‌ట్టేది కాదు” అని ఇషాంత్​ శర్మ పేర్కొన్నాడు. అయితే, ఈ సంఘటన మరోరకంగా వరంలా పనిచేసిందని ఇషాంత్​ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్​ తర్వాతే తాను ప్రతి విషయంలో బాధ్యతతో ప్రవర్తించిన‌ట్టు తెలిపాడు.

 

Read More : రియా చక్రవర్తికి ఈడీ సమన్లు