Dussehra 2023: దసరా బరిలో ముగ్గురు హీరోలు.. ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందో తెలుసా..?
దసరాకు మూడు సినిమాలు వస్తున్నాయి. అందులోనూ మూడు భారీ సినిమాలు.. ఎవరికి ఎవరు తీసుకోరు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ ఎవరికి వాళ్ళు తమ సినిమాలతో దండయాత్రకు బయలుదేరుతున్నారు. ఈ దసరా సీజన్లో కచ్చితంగా తమ సినిమా విజయం సాధిస్తుంది అంటే కాదు తమ సినిమా విజయం సాధిస్తుంది అంటూ నమ్మకంగా ఉన్నారు వాళ్ళు.

దసరాకు మూడు సినిమాలు వస్తున్నాయి. అందులోనూ మూడు భారీ సినిమాలు.. ఎవరికి ఎవరు తీసిపోరు. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ ఎవరికి వాళ్ళు తమ సినిమాలతో దండయాత్రకు బయలుదేరుతున్నారు. ఈ దసరా సీజన్లో కచ్చితంగా తమ సినిమా విజయం సాధిస్తుంది అంటే కాదు తమ సినిమా విజయం సాధిస్తుంది అంటూ నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు ఉన్న మాట మాత్రం వాస్తవం. కచ్చితంగా ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించే సత్తా వీటికి ఉంది. అయితే ఈ మూడిట్లో దేనికి ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి అంటే మాత్రం బాలకృష్ణ సినిమాకే అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.
అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. దసరా అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు ఎక్కువగా వస్తారు. పండగ సెలవులు ఉన్నప్పుడు కుటుంబం అందరూ థియేటర్స్ వైపు కదులుతారు. వాళ్ళు థియేటర్స్ వరకు రావాలి అంటే అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండాలి. మాస్ కమర్షియల్ అంశాలు ఉన్నా కూడా.. ఎమోషన్స్ ఉంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో మిగిలిన రెండు సినిమాల కంటే భగవంత్ కేసరి కాస్త ముందు ఉంది. టైగర్ నాగేశ్వరరావు, లియో పూర్తిగా మాస్ డ్రగ్స్ బేస్డ్ సినిమాలు. ఈ రెండు సినిమాల్లోని ఎమోషన్స్ ఉంటాయి.. కానీ బాలయ్య సినిమాలో మాత్రం ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. పైగా తండ్రి కూతురు సెంటిమెంట్ కావడం.. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఎడ్జ్ ఈయనకు ఎక్కువుంది.
పాజిటివ్ టాక్ గాని వచ్చిందంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు.. ఆ తర్వాతే మిగిలిన రెండు సినిమాల వైపు అడుగులు వేస్తారు అనేది కాదనలేని నిజం. ఈ విషయంలో బాలయ్య చేయాల్సింది ఒక్కటే.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం. దానికి తోడు సినిమాలో అనవసరంగా పాటలు, ఫైట్లు పెట్టలేదు.. కామెడీ సీన్లు ఉండవు.. కేవలం కథ ప్రకారం ముందుకు వెళుతుంది అని క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. దాన్నిబట్టి ముందుగానే ఇది ప్రయోగాత్మక సినిమా అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అభిమానులు కూడా రెగ్యులర్ బాలయ్య సినిమాల కాకుండా కొత్తగా చూడాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో బాలయ్య సినిమాకు కాస్త అడ్వాంటేజ్ ఉంది.
మరోవైపు రవితేజ సినిమాని కూడా తీసి పారేయడానికి లేదు. టైగర్ నాగేశ్వరరావు ఆయన కెరీర్ లో మొదటి పాన్ ఇండియా. సినిమా దానికి తోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకుంటున్నాడు మాస్ రాజా. ఇంకో వైపు విజయ్ లియోపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. తెలుగులో కూడా దీనిపై ఓ రేంజ్ అంచనాలు ఉండడంతో ఓపెనింగ్స్ కూడా బలంగా ఉంటాయని నమ్ముతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తుండడంతో థియేటర్స్ వరకు కూడా నో ఇష్యూ. కాకపోతే ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండడం.. డబ్బింగ్ సినిమా కావడంతో బాలయ్య, రవితేజ తర్వాతే విజయ్ వైపు ఆడియన్స్ చూపు పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి చూడాలి దసరా సినిమాల రేసులో తలపడి నిలబడేది ఎవరో…!
మరిన్ని సినిమా వార్తలు చదవండి




