Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షోలో విశిష్ట అతిథి.. శ్రీలీల, నవీన్ పోలిశెట్టితోపాటు ఆయన కూడా

బాలయ్య, శ్రీలీల, ననవీన్ పొలిశెట్టి ఎపిసోడ్ లో ఫుల్ కామెడీ ఉంటుందని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమోలో నవీన్ శ్రీలీలతో చేసిన సందడి నెక్స్ట్ లెవల్ అంతే.. బాలయ్య కూడా ఈ యంగ్ హీరో, హీరోయిన్ తో కలిసి తెగ సందడి చేశారు.

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షోలో విశిష్ట అతిథి.. శ్రీలీల, నవీన్ పోలిశెట్టితోపాటు ఆయన కూడా
Unstoppable With Nbk
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2024 | 1:20 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ టాక్ షో ఇప్పుడు సీజన్ 4లోకి అడుగు పెడుతోంది. స్టార్ హీరోలతో బాలయ్య చేస్తున్న ఈ టాక్ షోకు ఎంతో మంది స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరయ్యి సందడి చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. బాలకృష్ణతో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి చేసే సందడితో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

బాలయ్య, శ్రీలీల, ననవీన్ పొలిశెట్టి ఎపిసోడ్ లో ఫుల్ కామెడీ ఉంటుందని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమోలో నవీన్ శ్రీలీలతో చేసిన సందడి నెక్స్ట్ లెవల్ అంతే.. బాలయ్య కూడా ఈ యంగ్ హీరో, హీరోయిన్ తో కలిసి తెగ సందడి చేశారు. అంతే కాదు తాజాగా విడుదలైన పుష్ప 2 కిస్సిక్ సాంగ్ కు బాలకృష్ణ, నవీన్, శ్రీలీల డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో ఓ స్పెషల్ గెస్ట్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.

ఎప్పుడు సెలబ్రెటీలే కాదు అప్పుడప్పుడూ కొందరు సమాజ సేవచేసే వారిని కూడా అన్ స్టాపబుల్ లో గెస్ట్ లుగా హాజరవుతూ ఉంటారు. తాజాగా డా. నరేంద్ర కూడా నవీన్ పోలిశెట్టి , శ్రీలీల ఎపిసోడ్‌లో అతిథి ఎంట్రీ ఇవ్వనున్నారు. డా. నరేంద్ర ఎంతో మందికి స్పూర్తిదాత. ఆయన సిటీలో ఉద్యోగం వదిలి భద్రాద్రి కొత్తగూడెంలోని గిరిజన గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ నీరు, విద్యుత్ , వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేని గిరిజనులకు సేవచేయాలని నిర్ణయించుకున్నారు.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేసి, తన ఉచిత సేవలతో ఎంతోమంది ప్రాణాలను కాపాడారు నరేంద్ర. వైద్య చికిత్స అందించడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, గ్రామానికి విద్యను తీసుకురావడం, అక్కడి గ్రామాలకు నీరు, విద్యుత్తు సౌకర్యాలను అందించడంలో డాక్టర్ నరేంద్ర కీలక పాత్ర పోషించారు. డా. నరేంద్ర స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి మరింత తెలుసుకోవడానికి, డిసెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న అన్ స్టాపబుల్ షో చూడాల్సిందే.

D. Narendra

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీలీల, నవీన్ పోలిశెట్టితోపాటు ఆయన కూడా
శ్రీలీల, నవీన్ పోలిశెట్టితోపాటు ఆయన కూడా
విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ మళ్లీ తీసుకోబోతున్నాడా..?
విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ మళ్లీ తీసుకోబోతున్నాడా..?
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..
ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..
బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..
బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..
వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు
వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు
జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!
జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!
మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!
మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!
స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..
స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..