01 December 2024

తెలుగులో కోటి రెమ్యునరేషన్.. కట్ చేస్తే పెళ్లి కాకుండానే తల్లైంది..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. దక్షిణాదిని అప్పట్లో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

తెలుగులో మొట్ట మొదటిసారిగా ఒక్క సినిమాకు రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్. ఆమె మరెవరో కాదు ఇలియానా.

ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్. దేవదాసు సినిమాతో తెలుగు తెరకి పరిచయమై తక్కువ సమయంలో క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత మహేష్ బాబు పోకిరి సినిమాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. 

తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. 

అయితే కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొందట ఇలియానా. అలాగే మూడు నెలల ట్రైనింగ్ తర్వాత ఓ సినిమాలో రిజెక్ట్ చేశారట. 

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా.. ఆకస్మాత్తుగా తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చింది. 

అయితే పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ తనకు బాబు జన్మించిన తర్వాత తన భర్తను పరిచయం చేస్తూ వరుస పోస్టులు పెట్టింది.