ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గురించి షోయబ్ అక్తర్ ఇండియా పై ఘాటైన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పీసీబీ నిర్ణయాలపై స్పందిస్తూ, భారత్‌లో ఐసీసీ ఈవెంట్‌లకు వెళ్లి గెలవాలని సూచించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్నప్పటికీ, పీసీబీ భారత్‌కు ప్రత్యేక డిమాండ్లతో ముందుకొచ్చింది. అక్తర్, పాకిస్థాన్ జట్టును మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని హితబోధ చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో స్పందించాడు. పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినప్పటికీ, ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించబడుతుందని ఇప్పటికే స్పష్టమైంది. కానీ, పీసీబీ భారతదేశంలో నిర్వహించే అన్ని ఐసీసీ ఈవెంట్‌ల కోసం కూడా అదే విధానాన్ని అనుసరించాలని కోరింది, ఇది కొత్త చర్చలకు దారితీసింది.
పీసీబీ బలమైన నిర్ణయాలు తీసుకోవడంపై అక్తర్ సానుకూలంగా ఉన్నప్పటికీ, టీమిండియానును పాకిస్థాన్ కు పంపకుండా ఉండటం పట్ల ఆయన వ్యతిరేకించాడు. “మీరు హోస్టింగ్ హక్కులు పొందుతున్నప్పుడు, ఆదాయంలో భాగస్వామ్యం అందుతుందని అర్థం చేసుకోవాలి. పీసీబీ తన స్థానాన్ని బలంగా ఉంచింది, అది సరైనదే. కానీ మనం భారత్‌లో ఐసీసీ ఈవెంట్‌లకు వెళ్లాలి. అక్కడకి వెళ్లి వారిని వారి సొంత మైదానంలో ఓడించాలి,” అంటూ అక్తర్ తన ఉగ్రమైన అభిప్రాయాన్ని వెల్లడించి కొత్త చర్చలకు తెర లేపాడు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం, భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించబడతాయి. భారత్ నాకౌట్ దశకు చేరితే, సెమీఫైనల్‌లు, ఫైనల్ కూడా దుబాయ్‌లో జరుగుతాయి. భారత్ ముందుకు సాగకపోతే, ఈ కీలక మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరుగుతాయి.
భారత్‌తో భవిష్యత్ లో స్నేహ పూర్వక బంధాన్ని ఏర్పరచుకోవడం అనివార్యం అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. కానీ పాకిస్థాన్ జట్టును భారత మైదానంలోనే విజయం సాధించగల శక్తివంతమైన జట్టుగా తయారు చేయాలని సూచించాడు. “వహిన్ ఉన్హే మార్కే ఆవో” అంటే, వారి సొంత గడ్డపై వారిని ఓడించడమే మా అసలు లక్ష్యమై ఉండాలి అని స్పష్టం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తి స్థాయిలో పాకిస్థాన్‌లో నిర్వహించాలని పీసీబీ ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్‌నే ఆమోదించారు. అయితే, ఈ డిమాండ్‌లు పీసీబీ యొక్క బలమైన వైఖరిని ప్రదర్శించాయి.
షోయబ్ అక్తర్ మాటలతో, పీసీబీ, ఐసీసీ, భారత్ పక్కాపాటి వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ ప్రతిభను మెరుగుపరుచుకొని, ఎక్కడైనా, ఎవరితోనైనా పోటీపడగలదని ప్రపంచానికి చాటాలని పేర్కొన్నాడు.
Hybrid Model pehle decide ho gaya tha. Shoaib Akhtar VC PTV sports official pic.twitter.com/6nZEthwHH3
— iffi Raza (@Rizzvi73) December 1, 2024