కష్టాలు అనేవి చిన్ననాటి నుంచే సిల్క్ స్మిత చుట్టూ ఉన్నాయి. ఆమె పుట్టినప్పటి నుంచే పేదరికం వెక్కిరించింది.
దాంతో 4వ తరగతిలోనే చదువుకు కూడా స్వస్తి చెప్పింది. అక్కడ్నుంచి మద్రాస్ రైల్ ఎక్కి.. ఎలాగైనా నటి కావాలనే కోరికతో తన అత్త ఇంటికి చేరింది.
తన పేరు స్మితగా మార్చుకుంది. అలా 1980లో వచ్చిన వండి చక్రం సినిమాలో సిల్క్ పాత్రతో గుర్తింపు తెచ్చుకుని.. సిల్క్ స్మిత అయిపోయింది.
వండి చక్రంలో సిల్క్ పాత్ర సక్సెస్ కావడంతో ఎక్కువగా ఆమెకు అలాంటి వ్యాంప్ తరహా పాత్రలే వచ్చాయి. పైగా మలయాళంలోనూ కెరీర్ కొత్తలో కొన్ని అడల్ట్ రేటెడ్ సినిమాలు చేసింది సిల్క్.
దాంతో ఆమెలోని నటిని చూడటం మానేసారు దర్శకులు.. కేవలం ఐటం గాళ్‌గానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. స్మిత కూడా నటిగా నిరూపించుకోవాలని ఎదురు చూసి చూసి అలిసిపోయింది.
వరసగా ఐటం సాంగ్స్‌తో పాటు వ్యాంప్ తరహా పాత్రలు చేస్తున్నా కూడా.. మధ్య మధ్యలో సీతాకోకచిలక లాంటి సినిమాలతో తనలోని నటిని పరిచయం చేసారు స్మిత.
కానీ పరిస్థితులు ఆమెను వ్యాంప్ పాత్రలకు పరిమితం చేసాయి. సినిమాల్లో అలా ఉన్నా.. నిజ జీవితంలో మాత్రం జగమొండితో పాటు నిజాయితీగా బతికారు సిల్క్.
ఎవరైనా తన దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే.. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈమె పుట్టినరోజు కావడం విశేషం.