ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి రూల్.. అందరూ అవుట్.. 

02 December 2024

Battula Prudvi

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రోపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్’.

ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ డిసెంబరు 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో వస్తున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది.

కూలీగా మొదలైన పుష్పరాజ్‌ ఎర్ర చందనం సిండికేట్‌కు నాయకుడు ఎలా అయ్యాడో ‘పుష్ప 1 ది రైజ్’లో చూపించారు సుకుమార్.

ఈ క్రమంలో పెరిగిన శత్రువులతో పోరాడుతూ పుష్ప.. నేషనల్‌ నుంచి ఇంటర్నేషల్‌ స్థాయికి ఎలా ఎదిగాడు అన్నది కథ.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విదులైన పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘పీలింగ్స్‌’ అంటూ సాగె ఓ డ్యూట్ సాంగ్‌ సోషల్‌మీడియాను షాక్ చేస్తుంది.

దేశవ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా నడుస్తుండటంతో తెలుగుతో పాటు మరికొన్ని భాషల సినిమాలు ఈ వారం పోటిలో నుంచి తప్పుకున్నాయి.