చంద్రుని వెన్నలను తనలో దాచుకుందేమో ఈ కోమలి.. మెస్మరైజ్ సంయుక్త..
02 December
2024
Battula Prudvi
11 సెప్టెంబర్ 1995న దేవతల భూమిగా పిలవబడే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో జన్మించింది వయ్యారి భామ సంయుక్త .
తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది.
2016లో మలయాళ చిత్రం పాప్‌కార్న్‌తో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. తర్వాత తమిళ భాషా యాక్షన్ థ్రిల్లర్ కలారిలో తేన్మొళిగా కనిపించింది.
ఆమె తర్వాత ఫిబ్రవరి 2022లో విడుదలైన భీమ్లా నాయక్‌లో నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.
తర్వాత తెలుగులో బింబిసారలో కథానాయకిగా నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి ఈ బ్యూటీకి.
తర్వాత సార్ సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి. ఇందులో ధనుష్ తో జోడిగా కనిపిచింది.
తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన విరూపాక్ష సినిమాతో నటవిశ్యరూపం చూపించి ప్రేక్షకులను భయపెట్టింది ఈ భామ.
ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభూ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది ఈ కోమలి. ఇతర భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈమె స్పర్శ చాలు.. జాబిలి మెరిసిపోతుంది.. స్టన్నింగ్ సాయి ధన్షిక..
చీర కట్టిన చందమామ ఈ కోమలి రూపాన భువిపైకి చేరింది.. క్యూటీ శ్రీలీల..
ఈ ముద్దుగుమ్మ చిరునవ్వుకి చంద్రుడు ఫిదా.. మెస్మరైజ్ రష్మిక..