దుమ్మురేపుతున్న హారర్ మూవీ.. సీన్ సీన్‌కు సుస్సూ పోసుకోవాల్సిందే

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ ను మించి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి.

దుమ్మురేపుతున్న హారర్ మూవీ.. సీన్ సీన్‌కు సుస్సూ పోసుకోవాల్సిందే
Horror Movie

Updated on: Sep 07, 2025 | 2:45 PM

ప్రస్తతం థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక చిన్న సినిమాతోపాటు రెండు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. యూట్యూబర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మౌళి హీరోగా, తెలుగమ్మాయి శివాని నాగారం హీరోయిన్ గా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళ్ సినిమా మదరాసి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటీ సినిమా కూడా సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

వీటితో పాటే ఓ హాలీవుడ్ సినిమా కూడా థియేటర్స్ లోకి వచ్చింది. మనదగ్గర హాలీవుడ్ సినిమాలకు కూడా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాలు మన దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమా చూడటానికి జనం థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. అది ఒక దెయ్యం సినిమా. ఈ సినిమాను భయపడుతూనే చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ

ఇప్పుడు థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సినిమా మరేదో కాదు కన్జ్యూరింగ్ లాస్ట్ రైట్స్. కన్జ్యూరింగ్ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ హారర్ మూవీ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు కన్జ్యూరింగ్ నుంచి కొత్త సిరీస్ వచ్చింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా లాస్ట్ రైట్స్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత సిరీస్ లతో పోల్చితే ఈ సినిమాలో భయాన్ని కలిగించే సీన్స్ చాలానే ఉన్నాయి. సీన్ సీన్ కు భయంతో ప్రేక్షకులు వణికిపోతున్నారు. ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ సినిమాను థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.