Devayani: ‘సుస్వాగతం’ హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా ?.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది దేవయాని. కానీ ఆ తర్వాత కథానాయికగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో సహాయ నటిగా పలు చిత్రాల్లో కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాలో తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది.

Devayani: 'సుస్వాగతం' హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా ?.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Devayani
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jan 26, 2024 | 10:15 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ మ్యూజిక్ అందించారు. అప్పట్లో ఈ సినిమాలోని సాంగ్స్ హిట్ అయ్యాయి. ఇందులో దేవయానికి కథానాయికగా నటించింది. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది దేవయాని. కానీ ఆ తర్వాత కథానాయికగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో సహాయ నటిగా పలు చిత్రాల్లో కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాలో తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ తో ప్రేమలో పడింది దేవయాని.

వీరి ప్రేమను ఇరు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి 2001లో గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇనియా, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాల్లో సహయ పాత్రలలో నటిస్తుంది దేవయాని. ప్రస్తుతం ఆమె కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో దేవయాని కూతుళ్లను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎంతో క్యూట్‏గా సంప్రదాయంగా కనిపిస్తున్నారు.

తెలుగులో జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటనకు గుడ్ బై చెప్పేసి టీచర్ గా ఉద్యోగం చేస్తుంది. తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఆమె పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరిక ఉండేదట. అందుకే టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొంది ఇప్పుడు టీచర్ గా ఉద్యోగం చేస్తుంది దేవయాని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.