15ఏళ్లకే ఇండస్ట్రీలోకి భారీ హిట్.. ఇప్పుడు 40ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా హిట్స్ ..
ఒకప్పుడు.. ఇప్పుడు.. ఇన్ స్టాలో ఈ ట్రెండ్ మీరు చూసే ఉంటారు. చాలామంది నమ్మలేని విధంగా మారిపోయిన తమ, తమ లుక్స్‌ను ఇన్ స్టాలో పంచుకుంటున్నారు. ఆ ఫోటోలకు లైక్స్, కామెంట్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. అలానే సెలబ్రిటీల చిన్ననాటి, పాత ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే చాలు.. వారి ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.

ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పించి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఆమె తెలుగులో తోపు హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె.. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ఆమె. 15 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఆమె.. అంతే కాదు ఇప్పటికీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది. 40 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ హిట్స్ సాధిస్తుంది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి :ఏం సినిమారా బాబూ..! రూ. 80కోట్లు పెట్టి తీస్తే రూ. 8కోట్లు కూడా రాబట్టలేకపోయింది
పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఏమరెవరో కాదు అందాల తార, సీనియర్ హీరోయిన్ మీనా. ఒకప్పుడు మీనాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఈ స్టార్ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మీనా. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇది కూడా చదవండి : కేరాఫ్ కంచరపాలెం సలీమా గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.
మీనాకి 15 ఏళ్ళ వయసులోనే సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం మీనా కెరీర్ ని మార్చేసింది. ఈ సినిమా తర్వాత మీనా క్రేజ్ పెరిగిపోయింది. తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది మీనా. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది.ఈ చిన్నారి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. 2022 జూన్ 28న మీనా భర్త అనారోగ్యంతో చనిపోయారు. తెలుగులో దృశ్యం సినిమా చేసింది మీనా, అలాగే దృశ్యం 2లోనూ నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇది కూడా చదవండి : మహేష్, పవన్‌లాంటి స్టార్స్‌తో ఆడిపాడిన ఈ బ్యూటీ గుర్తుందా..? 51ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉంటున్న

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.