Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్‏కు ఏమైంది..? ఇలా మారిపోయింది.. షాకవుతున్న ఫ్యాన్స్..

అప్పట్లో బొద్దుగా, అందంగా ఉండే ఆమె ఇప్పుడు సన్నగా అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ హీరోయిన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఏంటీ ఆమె ఇలా మారిపోయింది? అసలేం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్‏కు ఏమైంది..? ఇలా మారిపోయింది.. షాకవుతున్న ఫ్యాన్స్..
Rekha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2024 | 12:35 PM

తెలుగు సినీ పరిశ్రమలోకి ఇప్పుడిప్పుడే పలువురు హీరోయిన్స్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మీరా జాస్మిన్, లయ, లైలా, స్నేహా వంటి హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఓ కథానాయికగా లేటేస్ట్ లుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయింది. అప్పట్లో బొద్దుగా, అందంగా ఉండే ఆమె ఇప్పుడు సన్నగా అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ హీరోయిన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఏంటీ ఆమె ఇలా మారిపోయింది? అసలేం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. తనే హీరోయిన్ రేఖ.

తెలుగులో ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకలకు దగ్గరైంది. కర్నాటకకు చెందిన ఆమె 2001లో శ్రీనువైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రేఖ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఆనందం తర్వాత జాబిలి చిత్రంలో కనిపించింది. నందమూరి తారకరత్న సరసన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా అప్పట్లో మ్యూజికల్ హిట్ కావడంతో రేఖ క్రేజ్ మారిపోయింది.

తెలుగులో దొంగోడు, జానికి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకుందాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు చిత్రాల్లో నటించింది. 2008లో నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కన్నడలో సెటిల్ అయ్యింది. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించింది. ఇటీవల బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొంది. అయితే అప్పుడు బొద్దుగా ఉండే రేఖ మాత్రం ఇప్పుడు సన్నగా మారిపోయింది.

Rekha New

Rekha New

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.