AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో టాప్.. ఇండస్ట్రీలో తోప్.. ఇంతకూ ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే సినిమాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. దాంతోపాటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

స్కూల్‌లో టాప్.. ఇండస్ట్రీలో తోప్.. ఇంతకూ ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2025 | 6:22 PM

సినిమా సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. పదుల సంఖ్యలో ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్కూల్ లో టాప్ స్టూడెంట్ ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్. అంతే కాదు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి ఆమె.. హాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. ఆమె ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్స్ కు కూడా చుక్కలు చూపిస్తుంది. నటనలో తోపు, అందంలో అప్సరస.. ఆమె మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ భామ. హిందీలో సినిమాలు చేస్తూనే హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన సత్తా చాటింది ప్రియాంక. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో ప్రియాంక టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. మహేష్ బాబు సినిమాను పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.