ఈ బుడతడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో.. అమ్మాయిలు అతనంటే పడి చచ్చిపోతారు

ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఎవరో కనిపెట్టారా.? చాలా ఫెమస్ హీరో ఆయన..

ఈ బుడతడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో.. అమ్మాయిలు అతనంటే పడి చచ్చిపోతారు
Hero
Follow us

|

Updated on: Oct 29, 2024 | 1:55 PM

సినిమా హీరో, హీరోయిన్స్ ఫోటోల సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటే ఉంటాయి. ఈమధ్య ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల సందడి ఎక్కువ అవ్వడంతో సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో మరింత జోరుగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ బుడతడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో.. చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్సే.. అమ్మాయిలు అతనంటే పడి చచ్చిపోతారు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న చిన్నోడు మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ మలయాళ స్టార్ హీరో మమ్ముటి కొడుకు అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా దుల్కర్ దగ్గరయ్యాడు. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో.. ఆతర్వాత మహానటి సినిమాతో మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

ఇక సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మలయాళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. ఇటీవలే కల్కి సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు. అలాగే ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.