30 October 2024
సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం నా భాగ్యం.. సాయి పల్లవి
Rajitha Chanti
Pic credit - Instagram
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, కోలీవుడ్ హీరో శివకార్తికేయన జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అమరన్ అక్టోబర్ 31న విడుదల కానుంది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించగా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ప్రమోషన్లలో పాల్గొన్న సాయి పల్లవి అమరన్ ప్రాజెక్టుతోపాటు తదుపరి చిత్రాల గురించి కూడా ప్రస్తావించారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ కుటుంబాన్ని కలిశాను. బాధలో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏమాత్రం కన్నీళ్లు పెట్టకూడదని నిర్ణయించుకున్నాను.
తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని ముకుంద్ తండ్రి ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు.
వాళ్లకు లోలోపల ఎంతో బాధ ఉంటుంది.. కాకపోతే బయటకు చూపించరు. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు హీరోయిన్ సాయి పల్లవి.
అలాగే రామాయణం సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని.. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉందని అన్నారు.
సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం నా భాగ్యం. భయాన్ని పక్కన పెట్టి సీతమ్మగా మారాలకుని ఒక భక్తురాలిగా ఆ రోల్ చేస్తున్నానని అన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.