ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? మన స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది ఈ భామ

ఈ క్రమంలోనే పైన కనిపిస్తోన్న చిన్నదాని ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఈ అమ్మడికి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. స్టార్ హీరోల తో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? మన స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది ఈ భామ
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2023 | 5:53 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ముద్దుగుమ్మలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే పైన కనిపిస్తోన్న చిన్నదాని ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఈ అమ్మడికి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. స్టార్ హీరోల తో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకు ఆ భామ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు ఆమె అందాల తార భూమిక చావ్లా.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ బ్యూటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల కు ఇండస్ట్రీ హిట్స్ అందించింది ఈ ముద్దుగుమ్మ. భూమిక నటించిన ఒక్కడు, ఖుషి, సింహాద్రి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సీనియర్ హీరోలతోనూ జతకట్టి ఆకట్టుకుంది చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో కూడా నటించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రల్లో నటిస్తోంది భూమిక. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది భూమిక.