ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? మీరనుకుంటున్న హీరో కాదు గురూ
తమ అభిమాన హీరోలకు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు సంబందించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. పై ఫోటో గమనించారా..? పెద్దయినతో ఉన్న చిన్నాడు ఎవరో గుర్తుపట్టారా.? ఎన్టీఆర్ తో ఉన్న ఆ చిన్నాడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో. ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని స్టైల్ అది.

సెలబ్రిటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. సినిమా వాళ్ళ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకు. అందుకే వారి సినిమా విశేషాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోలకు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు సంబందించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. పై ఫోటో గమనించారా..? పెద్దయినతో ఉన్న చిన్నాడు ఎవరో గుర్తుపట్టారా.? ఎన్టీఆర్ తో ఉన్న ఆ చిన్నాడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో. ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని స్టైల్ అది. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక పై ఫొటోలో సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న బుడతడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన పేరుకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ తో ఉన్న ఆ బుడతడు మరెవరో కాదు తాతకు తగ్గ మనవడు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్. అవును పైన కనిపిస్తున్న ఫోటో మేజర్ చంద్రకాంత్ సినిమాలోది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు.
అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కూడా నటించాడు. అయితే ఈ సినిమా సెట్ లో తాతతో కలిసి ఎన్టీఆర్ దిగిన ఫోటో ఇది. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి .. ఆతర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగాడు. మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దేవార అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
— Jr NTR (@tarak9999) May 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




