Actress: 17 ఏళ్లకే తెలుగులో తోపు హీరోయిన్.. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం.. ఇప్పుడేం చేస్తుందంటే..
చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. 17 ఏళ్ల వయసులోనే కథానాయికగా వెండితెరపై మ్యాజిక్ చేసిన ఆమె... ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇంతకీ మీకు ఈ హీరోయిన్ గుర్తుందా.. ?

సాధారణంగా చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. కేవలం 16, 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. సినిమా ప్రపంచంలో కట్టిపడేసింది. టీవీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే కథానాయికగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత మాత్రం అనేక అవమానాలు ఎదుర్కొంది. హీరోయిన్ గా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. రెండుసార్లు విడాకులు తీసుకున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతేకాదు.. ఈ హీరోయిన్ పెళ్లి చేసుకునే సమయానికి అతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతడు 22 కంపెనీలకు యజమాని. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. నేహా పెండ్సే.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
నేహా పెండ్సే.. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ తెలుగులో సొంతం సినిమా సెకండ్ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. నేహా అసలు పేరు శుభాంగి. హిందీలో చాలా ఫేమస్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆర్య రాజేశ్, నమిత కలిసి నటించిన సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. కానీ అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు, సీరియల్స్ చేసింది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
హిందీలో బిగ్ బాస్ సీజన్ 12లో పాల్గొంది. అలాగే ‘ఐ కమ్ ఇన్ మేడమ్’ , ‘భాబీజీ ఘర్ పర్ హైన్!’ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1995లో ఏక్తా కపూర్ టీవీ షో ‘కెప్టెన్ హౌస్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. 2020లో వ్యాపారవేత్త శార్దూల్ సింగ్ బియాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ అతడు అంతకు ముందే రెండుసార్లు విడాకులు తీసుకున్నాడు. నేహా అతడికి మూడో భార్య కావడంతో అప్పట్లో ఆమెను ట్రోల్స్ చేశారు. నేహా భర్త ప్రముఖ వ్యాపారవేత్త. అతడికి 22 కంపెనీలను కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం 125 మిలియన్ యూఎస్ డాలర్లు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..







