Santhoshi Srikar: నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అందమైన ప్రేమకథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో సిద్ధార్థ్ నటించిన లవ్ స్టోరీలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. ప్రభుదేవా తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో జాగ్రత్త అనగానే చేతిలోని వస్తువులు కిందపడేసే అమ్మాయి గుర్తుందా.. ?

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ నటించిన ప్రేమకథ చిత్రాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. 2005లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ మూవీలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, జయ ప్రకాష్ రెడ్డి, అర్చన, తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో శ్రీహారి, త్రిష, సిద్ధార్థ్ పాత్రలే కాకుండా మరో రోల్ సైతం హైలెట్ అయ్యింది. అదే శ్రీహరి, త్రిష ఇంట్లో పనిమనిషి పాత్ర. జాగ్రత్త అంటే చాలు ఠక్కున చేతిలోని వస్తువులు కింద పడేసే అమ్మాయి పాత్రలో నటించి అలరించింది. తన ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ కు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ అమ్మాయి పేరెంటో తెలుసా.. ? సంతోషి శ్రీకర్. తమిళ సినీపరిశ్రమకు చెందిన నటి పూర్ణిమ కూతురు.
అలాగే ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబుకు స్వయానా కోడలు. నవదీప్ హీరోగా పరిచయమైన జై సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో ఫరా అనే ముస్లీం అమ్మాయి పాత్రలో అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కథానాయికగా కాకుండా సహాయ నటిగా కనిపించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడే, బంగారం, ఢీ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. సంతోషి శ్రీకర్ కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆ తర్వాత మాత్రం ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ భామ.. కాస్మోటిక్స్, ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో బిజినెస్ రన్ చేస్తుంది. మేకప్ క్లాసెస్, శారీ డ్రాపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తోంది. ప్రస్తుతం సంతోషి శ్రీకర్ పోస్టులు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




