Boys Movie: సెన్సేషనల్ మూవీ బాయ్స్‌లో నటించిన వీళ్లంతా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..
ఈ మధ్యకాలంలో శంకర్ చేసిన సినిమాల్లో కొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. విభిన్నమైన కథలతో సినిమాలు చేసి శంకర్ సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బాయ్స్ మూవీ ఒకటి. ఈ సినిమా ఒకప్పుడు యువతను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సన్సేషన్ అనే చెప్పాలి. ఈ మూవీతో హీరో సిద్దార్థ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతోనే హీరోయిన్ జెనిలియా పరిచయం అయ్యింది.
టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు శంకర్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అని ఫిక్స్ అయ్యేవాళ్ళు. ఈ మధ్యకాలంలో శంకర్ చేసిన సినిమాల్లో కొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. విభిన్నమైన కథలతో సినిమాలు చేసి శంకర్ సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బాయ్స్ మూవీ ఒకటి. ఈ సినిమా ఒకప్పుడు యువతను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ మూవీతో హీరో సిద్దార్థ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతోనే హీరోయిన్ జెనిలియా పరిచయం అయ్యింది. 29 ఆగస్టు 2003న విడుదలైంది బాయ్స్ సినిమా. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే వున్నాయి. ఇక ఈ సినిమా యుక్త వయసులో ఉన్న ఆరుగురు కుర్రాళ్ళు చిన్న చిన్న తప్పులతో తమ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు.? ఆ తర్వాత ఎలా సక్సెస్ అయ్యారు అన్నది చూపించారు. ఈ సినిమాలో ఇందులో సిద్ధార్థ్, భరత్, మణికందన్, థమన్, నకుల్ అలాగే జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు వీళ్లంతా ఎలా ఉన్నారు అని చాలా మంది వెతుకుతున్నారు.
సిద్దార్థ్ హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. సూపర్ హిట్ సినిమాలతో హీరోగా ఎదిగాడు. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా చిన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే జెనీలియా కూడా హీరోయిన్ గా రాణించింది. ఈ ఇద్దరూ కలిసి బాయ్స్ తర్వాత బొమ్మరిల్లు అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే జెనీలియా తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఆతర్వాత రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే భర్తతో కలిసి ఓ మరాఠీ సినిమా చేసింది. అదేవిధంగా భరత్ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అలాగే థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరిస్తున్నాడు. ఇప్పుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే మిగిలిన వారు ఎలా ఉన్నారో కూడా లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.