Chandramukhi: ఇదెక్కడి అరాచకం రా సామి.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న చంద్రముఖి స్వర్ణ..

చంద్రముఖి సినిమాకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రజినీకాంత్, నయనతార, జ్యోతిక, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించగా.. వడివేలు భార్యగా సువర్ణ మాథ్యూ నటించింది.

Chandramukhi: ఇదెక్కడి అరాచకం రా సామి.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న చంద్రముఖి స్వర్ణ..
Suvarna
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2024 | 8:51 AM

ఇప్పటికీ ఎప్పటికీ సౌత్ అడియన్స్ మర్చిపోలేని సినిమా చంద్రముఖి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ వస్తే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో నయనతార, జ్యోతిక, ప్రభు, వినీత్, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అలాగే అటు మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా సూపర్ హిట్. ఇక ఇందులో రజినీ, వడివేలు కామెడీ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. వడివేలు తన భార్యను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఇందులో వడివేలు భార్య స్వర్ణ పాత్రలో నటించి చాలా పాపులర్ అయ్యింది సువర్ణ మాథ్యూ.

చంద్రముఖి సినిమాతో ఆమెకు చాలా పాపులర్ అయ్యింది సువర్ణ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. చంద్రముఖి సినిమా తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సువర్ణ.. థాయ్ మనసు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మయాబజార్, గోకులంలో సీత, పెరియతంబి వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1990లో ఎక్కువగా తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాలో చేసింది.

ప్రస్తుతం సువర్ణ సోషల్ మీడియాలో యాక్టివ్. నిత్యం ఏదోక ఫోటో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. వయసు పెరిగినా ఏమాత్రం తరగని అందంతో గ్లామర్ లుక్కులో కనిపించడంతో షాకవుతున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే