Prabhas : ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హల్ చల్.. అర్దరాత్రి డార్లింగ్‎ను చూడాలంటూ..

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. మరోవైపు అర్దరాత్రి ప్రభాస్ ను చూసేందుకు ఆయన ఇంటికి భారీ అభిమానులు చేరుకున్నారు. తమ హీరోను చూడాలంటూ నినాదాలు చేశారు.

Prabhas : ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హల్ చల్.. అర్దరాత్రి డార్లింగ్‎ను చూడాలంటూ..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2024 | 9:16 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అర్ధరాత్రి హల్ చల్ చేశారు. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ ఇంటి దగ్గర బర్త్‌ డే సెలబ్రేషన్స్ చేసేందుకు మంగళవారం అర్దరాత్రే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దమ్మ గుడి సమీపంలో సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధపడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓ దశలో ప్రభాస్ ఇంటి వైపు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అభిమాన హీరో ప్రభాస్‌ను కలిసేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత ఈ స్టార్ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి 1, 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరిచినప్పటికీ డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం మారలేదు. ప్రభాస్ నటించిన అన్ని చిత్రాలు థియేటర్లలో మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. ఇక ఇటీవలే విడుదలైన సలార్, కల్కి ప్రాజెక్ట్స్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.

ఈరోజు డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే రాజాసాబ్ మూవీ నుంచి ప్రభాస్ కటౌట్ పోస్టర్ రిలీజ్ కాగా.. మరిన్ని సినిమాల అప్డేట్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు తెగ ట్రెండ్ అవుతుంది.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.