Bigg Boss 8 Telugu: విష్ణుప్రియకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ.. యష్మీ ప్లాన్ సక్సెస్..
బిగ్ బాస్ సీజన్ 8లో గతవారం మణికంఠ సెల్ఫ్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హౌస్ లో నామినేషన్స్ ఎపిసోడ్ మరింత హీటెక్కించింది. ముఖ్యంగా ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ మధ్య ఓరేంజ్ ఫైట్ నడిచింది.
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడూ ఏదోక ఫ్రెండిషిప్ ప్రేమకథలు సాగుతూనే ఉంటుంది. ఇక ఈసారి హౌస్ లో పృథ్వీ, విష్ణు ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి చెప్పక్కర్లేదు. అసలు మీరిద్దరూ సింగిల్ గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ నామినేషన్లలో ఇద్దరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు హౌస్మేట్స్. అయినా పృథ్వీని ఎవరైనా నామినేట్ చేస్తే మధ్యలోకి దూరిపోయి మరీ గొడవ పెట్టేసుకుంది విష్ణు.. దీంతో ప్రేరణ పాయింట్ టూ పాయింట్ అడిగేసింది. పృథ్వీ కోసమే గేమ్ అంటూ ప్రేరణతో గొడవ పెట్టుకుంది యష్మీ. ఇక నామినేషన్స్ ప్రక్రియ ముగియగానే సీరియల్ బ్యాచ్ మొత్తం అర్దరాత్రి ముచ్చట్లు పెట్టుకుంది. ఈ క్రమంలోనే విష్ణు, పృథ్వీ బాండింగ్ గురించి మాట్లాడింది యష్మీ. ముఖ్యంగా పృథ్వీని నేరుగా అడిగేస్తూ అతడికి సున్నితంగానే క్లాస్ తీసుకుంది. నీకు ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను.. నాకు మీద్దరిని చూసి విసుగొచ్చింది.. ఎక్కడ చూసిన మీరిద్దరే కలిసి కనిపిస్తున్నారు.. నీకు ఆమె స్పేస్ ఇవ్వట్లేదు.. చాలా ఇరిటేట్ వస్తుంది.. ఇది ఇండివీడ్యువల్ గేమ్.. ఏదైనా ఉంటే బయట చూసుకుందాం అంటుంది యష్మీ.
నాకే ఇలా ఇరిటేట్ వస్తుందంటే.. వేరేవాళ్లకు అనిపించడంలో తప్పు లేదు కదా.. నీకు ఆమెపై ఏదైనా ఫీలింగ్ ఉందా అంటూ అసలు విషయం అడిగేసింది యష్మీ. లేదు అన్నాడు పృథ్వీ. తను నీకు జస్ట్ ఫ్రెండ్ అంతేనా అని తిరిగి యష్మీ అడగ్గా అవును అంటూ ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీ. మరీ ఎందుకు తనతో మాత్రమే క్లోజ్ గా ఉంటున్నావ్.. మిగిలిన వాళ్లతో కాకుండా తనతో ఎందుకు క్లోజ్ గా ఉంటావ్ అంటూ క్లాస్ తీసుకుంది. నేనేమి తన దగ్గరకి వెళ్లి మాట్లాడట్లేదు.. తనే వచ్చి మాట్లాడుతుంది అంటాడు పృథ్వీ. ఇక యష్మితో మాట్లాడిన తర్వాత విష్ణుతో మీటింగ్ పెట్టాడు పృథ్వీ. మనం ఓవర్ అయినట్లు నీకు అనిపిస్తుందా అని అడగ్గా… లేదు అని చెప్పింది విష్ణు.
నాకు ఎలాంటి రిలేషన్ వద్దు.. నేవు ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం.. ఈ విషయం నీకు ముందే చెప్పాను. నా మీద నీకు ఏమైనా అనిపిస్తుందంటే చెప్పు ఇక్కడే ఆపేద్దాం అన్నాడు పృథ్వీ. దీంతో డన్ అని చెప్పింది విష్ణు. నీకు ఏమనిపిస్తుంది.. రియల్ గా ఫీల్ అవుతుందా అని మళ్లీ అడగ్గా.. నవ్వుతూనే వెళ్లిపోయింది విష్ణు. తన బెడ్ దగ్గరికి బాధగా వెళ్లగా.. నబీల్ ఏమైందని అడిగాడు. పృథ్వీ గురించి బాధపడుతున్నావా.. నీకు మంచి భర్త దొరుకుతాడులే అంటూ సలహా ఇచ్చాడు.
ఇది చదవండి : Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..
Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..
Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.