Brahmamudi, October 23rd Episode: అనామిక మోసాన్ని కనిపెట్టిన కావ్య.. కళ్యాణ్‌లో మొదలైన ఆశ..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యకు సీతారామయ్య ఇచ్చిన అపాయిట్మెంట్ లెటర్ చూసి రాజ్ షాక్ అవుతాడు. అప్పుడే సీరియస్‌గా తాతయ్యా అని తలుచుకుంటాడు. అప్పుడే తింటున్న సీతారామయ్య పొలమారతాడు. అప్పుడే కావ్యకి ఫోన్ చేస్తాడు. దీంతో కావ్య స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏం జరుగుతుంది అమ్మా అక్కడ అని పెద్దాయన అడుగుతాడు. మీరూ నేను ఊహించిందే తాతయ్యా.. నన్ను సిఈవోగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారని అంటుంది కావ్య. ఆహా సరే టెర్మినేషన్ లెటర్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యకు సీతారామయ్య ఇచ్చిన అపాయిట్మెంట్ లెటర్ చూసి రాజ్ షాక్ అవుతాడు. అప్పుడే సీరియస్‌గా తాతయ్యా అని తలుచుకుంటాడు. అప్పుడే తింటున్న సీతారామయ్య పొలమారతాడు. అప్పుడే కావ్యకి ఫోన్ చేస్తాడు. దీంతో కావ్య స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏం జరుగుతుంది అమ్మా అక్కడ అని పెద్దాయన అడుగుతాడు. మీరూ నేను ఊహించిందే తాతయ్యా.. నన్ను సిఈవోగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారని అంటుంది కావ్య. ఆహా సరే టెర్మినేషన్ లెటర్ పంపిస్తాను.. ఇంటికి పంపించేయ్ ఆ మేనేజర్ గాడిని అని సీతారామయ్య అంటాడు. మాట్లాడతారా అని కావ్య అంటే.. నీ ఫోన్‌లో నేను మాట్లాడనని రాజ్ అంటాడు. ఏం అంటున్నాడు వాడు అని పెద్దాయ అడిగితే.. ఇంటికి వచ్చి తేల్చుకుంటానని అంటున్నారని కావ్య అంటుంది. రమ్మను ఆ వెధవని.. తేల్చుకుంటాను. ఇది నా ఆర్డర్. నా ఆర్డర్ ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని సీతారామయ్య అంటాడు. అప్పుడే శ్రుతి కొత్త సిఈవోకి బొకే ఇవ్వమని అంటుంది. బొకే ఇస్తూ కింద పడేస్తాడు రాజ్. ఆ తర్వాత సీరియస్‌గా ఇంటికి వెళ్తాడు రాజ్.
పెద్ద యుద్ధమే జరగనుంది..
తాతయ్యా విన్నారు కదా.. పెద్ద యుద్ధమే చేశారు. ఇప్పుడు ఆ యుద్ధం మీ పైకే వస్తుందని కావ్య అంటుంది. అలాంటివి అన్నీ చూసి చూసి అలిసి పోయాను. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా. వాడి ఆవేశానికి ఎవరూ బలి కాకూడదు. అందుకే కంపెనీ బాధ్యతులు నీకు అప్పగించానని పెద్దాయన అంటే.. నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టేశారు తాతయ్యా అని కావ్య అంటుంది. నువ్వు ఏదన్నా సమర్థంగా ఎదుర్కొంటావు అమ్మా.. అందుకే అని సీతారామయ్య అంటాడు. ఇక రాజ్ ఇంటికి వస్తాడు. తాతయ్యా.. తాతయ్యా అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి చెప్పరా అని పెద్దాయన అడిగితే.. ఆ కళావతిని సిఈవో చేసి మీరు నన్ను అవమానించారని రాజ్ అంటాడు. అది విని అపర్ణ, ఇందిరా దేవిలు తప్ప ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు.
కళావతిని ఇంటి నుంచి పంపించే ముందు నాతో చెప్పావా..
అది కావ్యలో ఉండే కళకు జరిగిన సన్మానం.. నీకేలా అవమానం అవుతుందని పెద్దాయన అంటాడు. నన్ను అవమానించడానికే కదా కళావతిని ఆ స్థానంలో ఉంచారని రాజ్ అంటాడు. ఇప్పుడు ఏంటిరా నీ బాధ అని పెద్దాయన అడిగితే.. నాకు చాలా బాధగా ఉంది తాతయ్యా.. కళావతిని సిఈవో చేసే ముందు నాకు ఒక్క మాట అయినా చెప్పాలని రాజ్ అడుగుతాడు. కావ్యని ఇంటి నుంచి బయటకు పంపించే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పావా? అని సీతా రామయ్య ప్రశ్నిస్తాడు. నేను నీ అనుమతి తీసుకోవడం ఏంటి రా.. బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు మాకు విలువ ఇస్తున్నావా? నీ భార్యని పట్టించుకుంటున్నావా.. నీలో ఇన్ని అవ లక్షణాలు పెట్టుకుని.. మమ్మల్ని విమర్శిస్తున్నావ్ ఏంటి.. సన్నాసి అని తిడతాడు. ఇదేంటి నేను ఇప్పటి విషయం గురించి మాట్లాడితే.. ఎప్పటివో అడుగుతున్నారు. నా ఆఫీస్‌లో నా అధికారాన్ని కళావతికి ఎందుకు ఇచ్చారని? రాజ్ ప్రశ్నిస్తాడు.
నా అభిప్రాయం మారదు..
కళావతికి అవార్డు వచ్చింది.. కళావతి లేకుండా అవార్డే తీసుకోలేక పోయావ్.. అహంకారంతో పోటీకి వెళ్లి మన కంపెనీ పరువు తీశావు. కళావతిని మోసం చేసిందని అనామికనే స్పష్టంగా మీ అమ్మకు, నాన్నమ్మకు చెప్పింది. కళావతి మోసపోయింది అంతే అని పెద్దాయన అంటుంది. ఏంటి బావా నువ్వు కూడా కళావతి అని పిలుస్తున్నావ్.. మనవరాలి పేరు కావ్య అని ఇందిరా దేవి అంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదని రాజ్ అంటే.. నాకూ నచ్చలేదని రుద్రాణి అంటుంది. నీ బోడి అభిప్రాయం ఎవరు అడిగారు? అని స్వప్న కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వా ధాన్య లక్ష్మి కూడా ఇలానే అంటే.. ప్రకాశం కూడా స్వప్న ఇచ్చిన సమాధానమే చెప్తాడు. వ్యక్తి గత కోపానికి.. బిజినెస్‌ని బలి చేస్తున్నావు.. రోజురోజుకూ మూర్ఖత్వం పెరిగిపోతుందని తిడతాడు సీతా రామయ్య అంటాడు. మన కంపెనీ ఎదుగుదలకు నా ప్రాణాలు ధార పోస్తున్నా.. ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వారే లేరా? అని రాజ్ అంటాడు. నేను ఉన్నాను రా.. నాన్నా ఏంటిది? రాజ్ కంపెనీ గురించి ఎంత కష్ట పడ్డాడు.. అవార్డు రావాలని కృషి చేశాడని రుద్రాణి అంటే.. ఫలితం ఏది? అవార్డు ఏదని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. ఇక నేను నిర్ణయం తీసుకున్నా.. అది మారదని పెద్దాయన చెప్పేసి వెళ్తాడు.
కళ్యాణ్‌లో మొదలైన ఆశ..
మరోవైపు కళ్యాణ్ ఆటో వెళ్తుండగా.. ఇద్దరు అమ్మాయిలు ఎక్కుతారు. అప్పుడే వాళ్లు కళ్యాణ్ రాసిన పాటను వింటారు. అది విని కళ్యాణ్ కూడా ఎంతో సంతోషిస్తాడు. చాలా బాగా రాశారు లిరిక్స్ అంటూ అమ్మాయిలు పొగుడుతారు. ఇక దిగిన అప్పూ చెప్పింది నిజమే. ఇక లేట్ చేయకుండా మరోసారి లక్ష్మీ కాంత్‌ని కలవాలని కళ్యాణ్ అనుకుంటాడు. కట్ చేస్తే.. అనామిక దుగ్గిరాల కంపెనీలో పని చేసే ఎంప్లాయ్‌కి కాల్ చేస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి.. రాజ్ వెళ్లిపోయాడా? అలాగే కావ్య కూడా వెళ్లిపోయేలా చేయాలి. అక్కడ జరిగిన అన్నీ విషయాలు నాకు చెప్పాలి. నీకు ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇస్తానని అనామిక అంటుంది.
అనామికకు వార్నింగ్..
అప్పుడే వచ్చి కావ్య షాక్ ఇస్తుంది. కమాన్ చెప్పండి.. ఇక్కడ విషయాలు అన్నీ అక్కడికి చేరవేయి.. హాయ్ అనామిక.. నేను కావ్య.. నువ్వు నన్ను తెలివిగా మోసం చేసి.. మా కంపెనీని దెబ్బకొట్టాలి అనుకున్నావ్. నేను అమాయకంగా మోసపోయాను. మొదటి సారి నువ్వు నన్ను దెబ్బ కొట్టావ్.. ఇప్పుడు నేను నిన్ను కోలుకోలేని దెబ్బ అని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆ తర్వాత అతన్ని అందరి ముందు నిల్చోబెట్టి.. జరిగినదంతా చెబుతుంది. ఆ నెక్ట్స్ అతని ఉద్యోగాన్ని పీకేసి.. సెక్యూరిటీ పోస్ట్ ఇస్తుంది కావ్య. ఇక ముందు నుంచి కంపెనీని ఎవరు మోసం చేయాలి అనుకున్నా.. ఇదే పరిస్థితి అని వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..