Raghavendra Movie: బాబోయ్.. ప్రభాస్ ‘రాఘవేంద్ర’ మూవీ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటీ.. ? అసలు గుర్తుపట్టలేరు బాస్..
అంతగా ప్రభాస్ మూవీస్ పై ఓ రేంజ్ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మీకు యంగ్ రెబల్ స్టార్ కెరీర్ లో కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకం. కెరీర్ ప్రారంభంలో డార్లింగ్ కెరీర్లో కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి. అందులో రాఘవేంద్ర ఒకటి. దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డార్లింగ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రభాస్ నటించే ప్రతి సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. అలాగే ఎప్పుడెప్పుడు డార్లింగ్ మూవీ అప్డేట్స్ రివీల్ చేస్తారా అని పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అంతగా ప్రభాస్ మూవీస్ పై ఓ రేంజ్ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మీకు యంగ్ రెబల్ స్టార్ కెరీర్ లో కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకం. కెరీర్ ప్రారంభంలో డార్లింగ్ కెరీర్లో కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి. అందులో రాఘవేంద్ర ఒకటి. దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
ఈ సినిమాలో మొదటి కథానాయికగా అన్షు నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా శ్వేత అగర్వాల్ నటించింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో నమ్మిన నా మది మంత్రాలయమేరా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో అందం, అభినయంతో కట్టిపడేసింది శ్వేత. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. చాలా కాలంపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న శ్వేత.. 2020లో వ్యాపారవేత్త ఆదిత్య నారాయన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా జన్మించింది.
2008లో ఇంగ్లీష్ లో తందూరి లవ్ అనే సినిమాలో కనిపించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కించిన షాపిత్ అనే హార్రర్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది శ్వేత. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. శ్వేతకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించిన శ్వేత.. నెట్టింట షేర్ చేసే ఫోటోస్ మాత్రం తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా తన కూతురితో కలిసి గడుపుతున్న క్షణాలను అభిమానులతో పంచుకుంటుంది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.