Varsham Movie: వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ? ఆ చిన్నోడు ఇప్పుడేం చేస్తున్నాడంటే.

ఇందులో ప్రభాస్ మేనల్లుడిగా కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పిల్లాడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఈ సినిమాలో ఆ చిన్నోడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రభాస్, తన మేనల్లుడితో కలిసి వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా మారిపోయాడో చూద్దాం.

Varsham Movie: వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ? ఆ చిన్నోడు ఇప్పుడేం చేస్తున్నాడంటే.
Varsham Movie
Follow us

|

Updated on: May 18, 2024 | 6:38 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా వర్షం. అప్పటికే ఈశ్వర్, రాఘవేంద్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దివంగత డైరెక్టర్ శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో త్రిష కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, గోపిచంద్, సునీల్, సుమ కనకాల కీలకపాత్రలు పోషించారు. ఇక ఇందులో ప్రభాస్ మేనల్లుడిగా కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పిల్లాడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఈ సినిమాలో ఆ చిన్నోడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రభాస్, తన మేనల్లుడితో కలిసి వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా మారిపోయాడో చూద్దాం.

ప్రభాస్, త్రిష జంటగా నటించిన వర్షం మూవీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్. ఇందులో డార్లింగ్ మేనల్లుడిగా కనిపించిన పిల్లాడి పేరు అక్షయ్ బచ్చు. ఈ చిన్నోడు తెలుగులో వర్షం సినిమాతోపాటు.. నాగార్జున నటించిన సంతోషం మూవీలోని కనిపించాడు. అందులో నాగ్ తనయుడిగా నవ్వులు పూయించాడు. నిజానికి అక్షయ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి ముందుగా పరిచయం అయ్యాడు. హిందీలో ఓ సినిమాలో క్యూట్ గా కనిపించిన అక్షయ్ ను చూసి నాగ్ తన సంతోషం మూవీలో ఛాన్స్ ఇచ్చాడట. ఆ తర్వాత వర్షం మూవీలో కనిపించాడు. ఇవే కాకుండా సీరియల్స్ కూడా చేశాడు అక్షయ్. అలాగే దాదాపు 45 యాడ్ ఫిల్మ్స్ చేసి మరింత పాపులర్ అయ్యాడు.

తర్వాత చదువు దృష్ట్యా యాక్టింగ్ కెరీర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న అక్షయ్.. ఇప్పుడు సింగర్ గా అలరిస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూనే అటు సింగర్ గా అలరిస్తున్నాడు. ఇప్పటికే హిందీలో పలు సినిమాల్లో పాటలు పాడుతు ఫేమస్ అయ్యాడు. అలాగే తన సోషల్ మీడియా ఖాతాలో పలు హిట్స్ సాంగ్స్ పాడుతూ వీడియోస్ షేర్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..
Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..
మేతి రైస్ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
మేతి రైస్ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు..
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు..
టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..
కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో హెచ్చరికలు
కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో హెచ్చరికలు
జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్
హీరోయిన్లకు చెబుతున్నదొకటి... కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి
హీరోయిన్లకు చెబుతున్నదొకటి... కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి