Pawan Kalyan: ‘ఖుషి’ సినిమాలో పవన్‌తో స్టెప్పులేసిన ముంతాజ్ గుర్తుందా ?.. ఇప్పుడెం చేస్తుందంటే..
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ముంతాజ్ ఒకరు. పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ.. ఖుషి చిత్రంలో పవన్‌తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసిన ముద్దుగుమ్మ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో ఖుషి ఒకటి. పవన్.. భూమిక జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఇటీవల రీరిలీజ్ చేయగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మరోసారి థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ముంతాజ్ ఒకరు. పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ.. ఖుషి చిత్రంలో పవన్‌తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసిన ముద్దుగుమ్మ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
ఈ చిత్రంలో ముంతాజ్, పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అంతేకాకుండా.. ఇందులో వీరిద్దరి కాంబోలో వచ్చే హోలి హోలి సాంగ్ కూడా అంతే సూపర్ హిట్. ఈ మూవీతో ముంతాజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. ముంతాజ్ పేరు నగ్మా ఖాన్. అప్పట్లో తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించేది. తమిళ్ ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించిన ఆమె.. తెలుగుతోపాటు.. హిందీ, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఆమె అందానికి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉండేవారు.
వెంకటేష్ సరసన జెమినీ సినిమాలోను స్పెషల్ సాంగ్ చేసింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో మరోసారి స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ముంతాజ్ లేటేస్ట్ ఫోటస్ చూస్తే ఆమె పెళ్లి చేసుకుని .. కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.