Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shweta Basu Prasad: అయ్యా బాబోయ్.. ఇంత క్యూట్‏గా ఉన్న హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ ?.. షాకిస్తున్న న్యూలుక్..

మొదటి సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలమయ్యింది. దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి. శ్వేత నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది.

Shweta Basu Prasad: అయ్యా బాబోయ్.. ఇంత క్యూట్‏గా ఉన్న హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ ?.. షాకిస్తున్న న్యూలుక్..
Actress 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2024 | 8:11 AM

ఎ..క్క..డా.. అంటూ అప్పట్లో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. చక్కటి రూపం.. కలువ కన్నులతో బిగ్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది కాలేజీ స్టూడెంట్ గా నటించి అచ్చమైన తెలుగమ్మాయిగా అలరించింది. ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది శ్వేత బసు ప్రసాద్. యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత. మొదటి సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలమయ్యింది. దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి. శ్వేత నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది.

పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన శ్వేత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అయినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. దీంతో అటు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లకు షాకిస్తున్నాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్స్ లో ఎంతో క్యూట్ గా కనిపించిన ఇప్పుడు గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పట్లో బొద్దుగా ఉన్న ఆ అమ్మడు.. ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది. ప్రస్తుతం శ్వేత బసు ప్రసాద్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

హీరోయిన్ గా వెండితెరపై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్వేతకు వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లిచేసుకుంది. కానీ మనస్పర్థలతో వీరిద్దరు విడిపోయారు. విడాకుల తర్వాత శ్వేత ఒంటరిగానే ఉంటుంది. ఇప్పుడు తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. శ్వేత కొత్త ఫోటోస్ పై ఓ లుక్కేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.