AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డ్యాన్స్ రాదు.. యాక్టింగ్ రాదంటూ విమర్శలు.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్..

తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ తొలి నాళ్లలో మాత్రం డాన్స్, యాక్టింగ్ రాదంటూ విమర్శించారు. ముఖం మీదనే ఎన్నో అవమానకరమైన మాటలు అన్నారు. దీంతో తనపై తానే నమ్మకం కోల్పోయి సినిమాలకు దూరం కావాలనుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఆమె మరెవరో కాదండీ..

Tollywood: డ్యాన్స్ రాదు.. యాక్టింగ్ రాదంటూ విమర్శలు.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2024 | 7:41 AM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. పెళ్లైనా ఏమాత్రం తగ్గేదే లే అంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ తొలి నాళ్లలో మాత్రం డాన్స్, యాక్టింగ్ రాదంటూ విమర్శించారు. ముఖం మీదనే ఎన్నో అవమానకరమైన మాటలు అన్నారు. దీంతో తనపై తానే నమ్మకం కోల్పోయి సినిమాలకు దూరం కావాలనుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఆమె మరెవరో కాదండీ.. హీరోయిన్ కత్రినా కైఫ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది.

కత్రీనా కైఫ్ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ మల్లీశ్వరి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ అదరగొట్టేసింది ఈ సినిమా. అయితే అప్పట్లో ఈ సినిమాలో కథానాయికగా నటించిన కత్రీనా యాక్టింగ్ పై విమర్శలు వచ్చాయి. ఆమెకు డాన్స్ రాదని.. ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా పెట్టలేదని అనేవారు. సాంగ్స్ షూటింగ్ టైమ్ లో డాన్స్ సరిగ్గా రావడం లేదని ఫీల్ అయ్యేదట. దీంతో ఎలా వచ్చినా చేయ్ అంటూ విజయ్ భాస్కర్ చెప్పేవాడట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మళ్లీశ్వరి సినిమా కోసం హీరోయిన్ ను వెతికి వెతికి అలసిపోయామని.. చివరకు ఓ యాడ్ చూసి కత్రినాను సెలక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

మళ్లీశ్వరీ సినిమా సమయంలో ఆమెకు రూ. డెబ్బై లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఆమె స్టాప్, రాకపోకలకు కలిపి మరో రూ. 25 లక్షలు అయి ఉంటుందని.. మొత్తం దాదాపు కోటి వరకు అయ్యేదని అన్నాడు. అప్పట్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే మాములు విషయం కాదన్నారు విజయ్ భాస్కర్. ఇక మళ్లీశ్వరి సినిమా సమయంలో యాక్టింగ్ రాదంటూ కామెంట్స్ ఎదుర్కొన్న కత్రీనా.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రేక్షకులను తనదైన నటనతో కట్టిపడేసే రేంజ్ కు చేరిందంటే అతిశయోక్తి కాదు.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.