Jr.NTR-Kodali Nani: ఫ్యాన్స్‎ను ఖుషి చేస్తోన్న ఫోటో.. అప్పట్లో ఎన్టీఆర్ , కొడాలి నాని ఎంత క్లోజ్‏గా ఉండేవారో చూశారా ?..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తారక్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మాస్త్రం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఇటు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. బాలీవుడ్ తార జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి వైరలవుతుంది.

Jr.NTR-Kodali Nani: ఫ్యాన్స్‎ను ఖుషి చేస్తోన్న ఫోటో.. అప్పట్లో ఎన్టీఆర్ , కొడాలి నాని ఎంత క్లోజ్‏గా ఉండేవారో చూశారా ?..
Jr.ntr, Kodali Nani
Follow us

|

Updated on: Apr 27, 2024 | 8:44 AM

ప్రస్తుతం వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇందులో రా ఏంజెంట్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తారక్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మాస్త్రం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఇటు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. బాలీవుడ్ తార జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి వైరలవుతుంది. తారక్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది ఆ ఫోటో. ఇంతకీ అందులో ఉన్న స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా ?.. అదేంటంటే.. ఆ ఫోటోలో ఎన్టీఆర్ తోపాటు.. ఆంధ్రప్రదేశ్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వల్లభనేని వంశీ కనిపిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోలో ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ కనిపిస్తున్నారు. అందులో మధ్యలో కొడాలి నాని కూర్చుని సీరియస్ గా పుస్తకం చూస్తున్నారు. పక్కనే తారక్ నవ్వుతూ నాని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. అలాగే మరోవైపు వల్లభనేని వంశీ కూడా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అప్పట్లో వీరు ముగ్గురు ఇంత క్లో్జ్ గా ఉండేవారా ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీరు ముగ్గురు ఒకప్పుడు మంచి స్నేహితులు. ముఖ్యంగా ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. తారక్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నానికి చాలా అభిమానం. అప్పట్లో టీడీపీ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొడాలి నానికి.. తారక్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పట్లో తారక్ సినిమాల విషయంలో కొడాలి నాని సలహాలు ఇచ్చేవారు. అలాగే అప్పుడప్పుడు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సెట్ లో సందడి చేసేవారు. అలాగే తారక్ నటించిన చిత్రాలను కొడాలి నాని నిర్మించినట్లు సమాచారం. కానీ కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.