Yamadonga Movie: యమదొంగ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? క్యాన్సర్‌ను జయించి ఇప్పుడేలా మారిందంటే..
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో యమదొంగ ఒకటి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో నెల్లూరు యాసలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టింది హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఇందులో తారక్, మమతా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో యమదొంగ ఒకటి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు తారక్, జక్కన్న కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక యమదొంగ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డ్ అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన ప్రియమణి కథానాయికగా నటించగా.. మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, అర్చన, ప్రీతి జంగ్యాని, నవనీత్ కౌర్, రంభ, ఖుష్బూ, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కీలకపాత్రలు పోషించారు. ఇక ఇందులో నెల్లూరు యాసలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టింది హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఇందులో తారక్, మమతా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాతో తెలుగులో ఈబ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే ఉండేది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.
కానీ యమదొంగ సినిమాతో వచ్చిన క్రేజ్ అంతగా ఉపయోగించుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మమతా మోహన్ దాస్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తెలుగులో వెంకటేశ్ నటించిన చింతకాయల రవి, కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్లపాటు క్యాన్సర్ చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటపడింది. ఆ తర్వాత చాలాకాలం పాటు విశ్రాంతి తీసుకున్న మమతా.. మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.
ఇటీవలే తెలుగు సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విలక్షణ నటుడు జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహారాజా చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మహారాజా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది మమతా మోహన్ దాస్. ఈ హీరోయిన్ లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.