Aadi Movie: ఎట్టా మారిపోయింది గురూ.. ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటిస్తోన్న ఈ మూవీ కోసం పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ వినిపిస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఆది ఒకటి. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లల్లోనే మాస్, యాక్షన్ సినిమాతో థియేటర్లలో విధ్వంసం సృష్టించాడు తారక్. ఆది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఇందులో తారక్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును కట్టిపడేసింది.
ఎన్టీఆర్ సరసన అద్భుతమైన నటనతోపాటు.. అమాయకత్వం.. చూడచక్కని రూపంతో తెలుగు ప్రేక్షకల హృదయాలను దోచుకుంది కీర్తి చావ్లా. అప్పుడు బొద్దుగా.. క్యూట్ గా కనిపించిన కీర్తికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఒకటి రెండు చిత్రాల్లో కనిపించింది. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో ఓ పాటలో కనిపించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది.
తెలుగులో కాశి, శ్రావణమాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కీర్తి రెగ్యులర్ గా వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అప్పట్లో నాజుగ్గా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..