Hatsun Curd: హాట్సాన్ కర్డ్ యాడ్ చిన్నారి గుర్తుందా ?.. హీరోయిన్‏లా మారిపోయింది..

అందులో ఓ చిన్నారి.. స్కూల్ లంచ్ బ్రేక్ సమయంలో బెంచ్ పై కూర్చుని లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే..అందులో పెరుగన్నం ఉంటుంది. ఆ బాక్స్ పట్టుకోగానే.. ఆమె చల్లని ప్రదేశంలో చుట్టూ చెట్లతో ఉన్న వాతావరణంలో ఉన్నట్లు అనుభూతి పొందుతుంది. హాట్సాన్ పెరుగు తింటే అలాంటి అనుభూతికి కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ యాడ్ రూపొందించారు. ఇందులో నటించిన ఆ చిన్నారి తెగ పాపులర్ అయ్యింది.

Hatsun Curd: హాట్సాన్ కర్డ్ యాడ్ చిన్నారి గుర్తుందా ?.. హీరోయిన్‏లా మారిపోయింది..
Hatsun Curd Ad Girl
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2023 | 8:18 PM

బుల్లితెరపై పలు యాడ్స్‏లలో నటించి పాపులర్ అయిన చిన్నారులు చాలా మంది ఉన్నారు. కొన్ని యాడ్స్ ఎప్పటికీ మర్చిపోలేము. ముఖ్యంగా అందులో నటించినవారిని ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే. ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన యాడ్స్ లలో హాట్సాన్ కర్డ్ యాడ్ ఒకటి. అదే పెరుగుకు సంబంధించిన ప్రకటన. అందులో ఓ చిన్నారి.. స్కూల్ లంచ్ బ్రేక్ సమయంలో బెంచ్ పై కూర్చుని లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే..అందులో పెరుగన్నం ఉంటుంది. ఆ బాక్స్ పట్టుకోగానే.. ఆమె చల్లని ప్రదేశంలో చుట్టూ చెట్లతో ఉన్న వాతావరణంలో ఉన్నట్లు అనుభూతి పొందుతుంది. హాట్సాన్ పెరుగు తింటే అలాంటి అనుభూతికి కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ యాడ్ రూపొందించారు. ఇందులో నటించిన ఆ చిన్నారి తెగ పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

హాట్సాన్ యాడ్ లో నటించిన పాప పేరు స్వక్ష అయ్యార్. ఇప్పటివరకు ఈ చిన్నారి 130 యాడ్స్ చేసింది. ప్రకటనలతోనే తెగ ఫేమస్ అయిపోయింది. కేవలం నటిగానే కాదు.. డాన్సర్ కూడా. ఇప్పుడు స్వక్ష అయ్యార్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం స్వక్షకు 217కే ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవలే క్రికెట్ స్టేడియంలో చేసిన ఓ రీల్ తెగ వైరలయ్యింది. అందులో తనకు చెన్నై సూపర్ కింగ్స్ అంటే అభిమానం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం స్వక్ష ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో అచ్చం హీరోయిన్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Swaksha✨ (@swakshaiyer)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.