Actress : సల్మాన్ ఖాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా ఛాన్స్.. అందంలో అప్సరస..
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్. కానీ ఇప్పుడు తెలుగులోకి కథానాయికగా తెరంగేట్రం చేస్తుంది. ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు.. ? ఇప్పుడు ఏ సినిమాలో నటిస్తుంది ? అనే విషయాలు తెలుసుకుందామా. అయితే పూర్తి వివరాలు మీకోసం..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో బజరంగీ భాయిజాన్ ఒకటి. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? తన అమాయకత్వంతో దేశాన్ని ప్రేమలో పడేసి దాదాపు పదేళ్లు అయింది. ఇప్పుడు ఆ చిన్నారి హీరోయిన్ అయ్యింది. అంతేకాదు.. తెలుగులో నటించేందుకు రెడీ అయ్యింది. ఆమె పేరు హర్షాలి మల్హోత్రా. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. అందమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇప్పుడు అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తెలుగు సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ అనే సీక్వెల్ లో ఆమె కనిపించనుంది.
కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది హర్షాలీ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ 2లో హర్షాలీ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి తెరంగేట్రం చేయనుంది. ఇందులో ఆమె జనని పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు ముంబైలో గ్రాండ్ మ్యూజిక్ లాంచ్ నిర్వహించారు. అక్కడ సినిమా మొదటి సింగిల్ ‘ది తాండవం’ ను ఆవిష్కరించారు. ఈ వేడుకలో హార్షాలీ అందంతో మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హర్షాలీ లుక్స్ అందరిని కట్టిపడేస్తున్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..




