Tollywood: పద్దతికి పట్టుచీర కట్టినట్లు ఉండేది.. ఇప్పుడు మోడ్రన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది..

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ్, మలయాళీ ముద్దుగుమ్మల జోరు కొనసాగుతుంది. ఆషికా రంగనాథ్, సంయుక్త మీనన్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్లకు పోటి ఇచ్చేందుకు మరో బ్యూటీ రెడీ అయ్యింది. పైన ఫోటోలో ఎంతో పద్దతిగా.. చూడగానే ఆకట్టుకునేంత అందంగా కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అటు చీరకట్టులో.. ఇటు మోడ్రన్ డ్రెస్సులలో నెట్టింట అందాల రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ అందాల తారను గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదు..

Tollywood: పద్దతికి పట్టుచీర కట్టినట్లు ఉండేది.. ఇప్పుడు మోడ్రన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది..
Actress 1
Follow us

|

Updated on: Apr 17, 2024 | 9:50 PM

సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా చెలమణి కావాలంటే ప్రతిభ పాటు మెస్మరైజ్ చేసే అందం కూడా ఉండాల్సిందే. అటు యాక్టింగ్ పరంగానే కాకుండా ఇటు గ్లామర్‏గానూ అల్లాడించేయాల్సిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది తారలు ఓవర్ నైట్ స్టార్ అయినవాళ్లే ఎక్కువ. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ మాత్రం తక్కువే. సినిమా ఆఫర్స్ అంతగా రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలుగు అడియన్స్ ముందుకు వస్తూ అప్పుడే భారీగా పాపులారిటిని సొంతం చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ్, మలయాళీ ముద్దుగుమ్మల జోరు కొనసాగుతుంది. ఆషికా రంగనాథ్, సంయుక్త మీనన్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్లకు పోటి ఇచ్చేందుకు మరో బ్యూటీ రెడీ అయ్యింది. పైన ఫోటోలో ఎంతో పద్దతిగా.. చూడగానే ఆకట్టుకునేంత అందంగా కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అటు చీరకట్టులో.. ఇటు మోడ్రన్ డ్రెస్సులలో నెట్టింట అందాల రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ అందాల తారను గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదు.. నవతరం కథానాయిక దివ్య భారతి.

అయితే దివ్య భారతి అంటే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున అలనాటి అందాల దివంగత హీరోయిన్ దివ్య భారతి గుర్తుకు వస్తుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం ఇప్పుడు కుర్రాళ్ల హృదయాలను దోచేసే గ్లామరస్ హీరోయిన్. బ్యాచులర్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే అందాల రాక్షసిగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంలోనే రొమాంటిక్ సీన్స్‏తో హద్దులు చెరిపేసింది. దీంతో ఆ అమ్మాడి పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కాలేజ్ డేస్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఎంతో చూడముచ్చటగా పద్దతిగా… అచ్చం పక్కింటి అమ్మాయిగా కనిపిస్తున్న దివ్య భారతిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇక నెట్టింట దివ్య భారతి చేసే హంగామా గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్.. వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. దివ్య భారతికి ఇన్ స్టాలో 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ అందాల తార సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత దివ్య భారతికి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.