కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్.. డెడికేషన్ అంటే ఇదే కదా..!

కొంతమంది విమర్శలు వస్తాయని సినిమా కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. స్టార్ డమ్స్ కూడా పక్కన పెట్టి నటిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా కడుపులో బిడ్డతో షూటింగ్ లో పాల్గొంది. గర్భవతి అయిన ఆ హీరోయిన్ సినిమా షూటింగ్ లో పాల్గొని అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్,

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్.. డెడికేషన్ అంటే ఇదే కదా..!
Actress
Follow us

|

Updated on: Apr 18, 2024 | 7:33 AM

నటీ నటులు సినిమాల కోసం ఏదైనా చేస్తారు..నటనకు ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి పాత్రలైనా పోషిస్తారు. ఇటీవలే మనం చూశాం ఆడు జీవితం సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ 16 ఏళ్లు కష్టపడ్డారు. అలాగే శరీరంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. అలాగే విక్రమ్ కూడా ఐ సినిమా కోసం బరువు తగ్గి కనిపించారు. ఇలా చాలా మంది పాత్రల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా అంతే .. కొంతమంది విమర్శలు వస్తాయని సినిమా కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. స్టార్ డమ్స్ కూడా పక్కన పెట్టి నటిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా కడుపులో బిడ్డతో షూటింగ్ లో పాల్గొంది. గర్భవతి అయిన ఆ హీరోయిన్ సినిమా షూటింగ్ లో పాల్గొని అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్, త్వరలో తెలుగులోనూ నటించనుంది. ఆమె ఎవరంటే..

చాలా మంది హీరోయిన్స్ బేబీ బంప్స్ తో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ.. తమ ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమ.. నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ కోసం ఇలా బేబీ బంప్ తో షూటింగ్ లో పాల్గొంది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే భర్త రణవీర్ సింగ్ తో కలిసి తాను త్వరలో తల్లి కాబోతున్న అని అనౌన్స్ చేసింది. దాంతో దీపికా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ.. బేబీ బంప్స్ తో ఫోటోలు షేర్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కడుపులో బిడ్డతో షూటింగ్ లో పాల్గొంది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగం ఎగైన్ అనే సినిమాలో దీపికా నటిస్తుంది. దీపికాతో పాటు అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా దీపికా కనిపించనుంది. తాజాగా బేబీ బంప్ తో దీపికా షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలు వైరల్ గా మారాయి. కొంతమంది ఆమె డెడికేషన్ ను ప్రశంసిస్తున్నారు. మరికొంతమంది అమ్మ అయ్యేముందు అవసరమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీపికా పదుకొనె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.