TOP9 ET: ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌!|భార్యా భర్తల బంధం అంటే ఇది క్యూట్ వీడియో వైరల్..!

TOP9 ET: ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌!|భార్యా భర్తల బంధం అంటే ఇది క్యూట్ వీడియో వైరల్..!

Anil kumar poka

|

Updated on: Apr 18, 2024 | 7:33 AM

ఓ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలుంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం అవ్వడం కామన్ అయిపోయింది రీసెంట్‌ డేస్లో. ఇక యంగ్ టైగర్, హృతిక్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా నుంచి కూడా తాజాగా కొన్ని ఫోటోస్ లీకయ్యాయి. అవి కాస్తా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండ్ అవ్వడమే కాదు.. హృతిక్, యంగ్ టైగర్ ఈ సినిమాలో దిమ్మతిరిగే స్టంట్స్ చేస్తున్నారనే హింట్స్ ఇస్తున్నాయి.

01.ntr: వార్ 2 నుంచి ఫోటోలు లీక్.

ఓ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలుంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం అవ్వడం కామన్ అయిపోయింది రీసెంట్‌ డేస్లో. ఇక యంగ్ టైగర్, హృతిక్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా నుంచి కూడా తాజాగా కొన్ని ఫోటోస్ లీకయ్యాయి. అవి కాస్తా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండ్ అవ్వడమే కాదు.. హృతిక్, యంగ్ టైగర్ ఈ సినిమాలో దిమ్మతిరిగే స్టంట్స్ చేస్తున్నారనే హింట్స్ ఇస్తున్నాయి.

02.kalki: ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు.. దటీజ్ ప్రభాస్‌!

క్రేజ్‌లోనే.. ఫ్యాన్ బేస్‌లోనే కాదు.. థియేట్రికల్ రైట్స్‌ రేట్స్‌ విషయంలోనూ ప్రభాస్‌ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు కూడా కల్కి థియేట్రికల్ రైట్స్‌ విషయంలోనూ ట్రెండ్ అవుతున్నారు ప్రభాస్‌. నాగ అశ్విన్ డైరెక్షన్లో .. సైన్స్‌ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న కల్కి.. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే 100 కోట్లు వచ్చేలా చేసుకుందట. ఇక ఈ లెక్కన నైజాం సీడెడ్ ఏరియాలను కలుపుకుంటే.. కల్కి థియేట్రికల్ రైట్స్‌ అందరికీ దిమ్మతిరిగేలా చేస్తుందనే కామెంట్ వస్తోంది.

03.naga: తండ్రి సెంటిమెంట్‌ను.. ఫాలో అవుతున్న కొడుకు

అప్పుడెప్పుడో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్టు కొట్టిన నాగచైతన్య ఆ తరువాత మాత్రం హిట్టు లేక పరేషాన్లో ఉన్నారు. ఇక అందుకే అన్నట్టు ఈ సారి తన తండ్రి నాగార్జున్‌ సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న తన తండేల్ సినిమాను.. తన తండ్రికి అచ్చొచ్చిన డేట్‌ డిసెంబర్ 20నే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

04.pawan: ఆగిందనుకున్న సినిమా నుంచి.! మళ్లొక అప్డేట్ వచ్చింది రోయ్‌..

హరి హర వీర మల్లు సినిమా ఆగిపోయిందన్న న్యూస్ వచ్చిన ప్రతీ సారీ ఓ అప్డేట్ బయటికి వస్తేనే ఉంది. ఇప్పుడు కూడా శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ‘ధర్మం కోసం యుద్ధం త్వరలో..’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. దీంతో ఈ మూవీ రిలీజ్ తొందర్లోనే.. అనే హింట్ ఇచ్చింది.

05.charan: భార్యా భర్తల బంధం అంటే ఇది! క్యూట్ వీడియో వైరల్.!

పడక గదిలోనే కాదు.. పది మందిలో ఉన్నా కూడా.. భార్యా భర్తల మధ్య కెమెస్ట్రీ ఉండాలి. అది వైఫైలా.. వైఫ్‌తో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉండాలి. చెర్రీ కనెక్షన్ కూడా తన వైఫ్‌ ఉపాసనతో అలానే ఉంది కాబట్టే.. తను అక్కడెక్కడో ఉండి సైగ చేసినా.. తన భార్య చెబుతుంది చెర్రీకి అర్థం అయిపోయింది. చెర్రీ పెదాలు కదిలిస్తూ చెప్పింది కూడా.. అక్కడెక్కడో ఉన్న ఉపాసనకు తెలిసిపోయింది. అయితే ఈ క్యూట్ మూమెంట్ వేల్స్ యూనివర్సిటీలో.. చెర్రీ డాక్టరేట్ అందుకునే సందర్భంగా జరిగింది. ఇప్పుడా వీడియో కాస్తా బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. క్యూట్ అండ్ బెస్ట్ కపుల్‌గా వీరిద్దరికీ ట్యాగ్ వచ్చేలా చేస్తోంది.

06.nidhi prabhas: హీరోయిన్‌కు బంపర్ ఆఫర్ ప్రభాస్‌ అంటే మాటలా మరి!

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. నిన్న కాక మొన్నటి వరకు ఉన్న నిధి ఫిల్మ్ కెరీర్ పరిస్థితి.. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. వెంకీ సినిమాలో బంపర్‌ ఛాన్స్‌ వచ్చింది అనుకునే లోపే… ప్రభాస్‌ రాజా సాబ్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయిపోయింది. అయిపోయవడమే కాదు.. రేపో మాపో.. ఈ మూవీ సెట్లో అడుగు కూడా పెట్టబోతోంది ఈ బ్యూటీ.

07.tillu: OTT లోకి టిల్లుగాడు.. డేట్ ఫిక్స్‌.!

125 కోట్ల కలెక్షన్స్‌తో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టిన టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. అందరి ఎదురు చూపుల మధ్య.. అందర్నీ ఎంటర్‌ టైన్ చేసేందుకు ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిపోయాడు. ఇక అకార్డింగ్‌ టూ లేటెస్ట్ న్యూస్.. టిల్లు స్వ్కేర్ మూవీ… ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్‌ కానుందట. అఫీషియల్గా ఈ న్యూస్ బయటికి రాకపోయినా.. అన్‌ అఫీషియల్‌గా మాత్రం ఇడస్ట్రీలో నుంచి లీకై పోయింది. నెట్టింట ట్రెండ్ అయిపోతోంది.

08.salman: పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌!

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ…. కానీ టార్గెట్ మిస్! ఇదే జరిగింది సల్మాన్ విషయంలో..! ఈ స్టార్‌ హీరోను ఎప్పటి నుంచో బెదిరిస్తూనే ఉన్న బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. ఈ సారి మాత్రం బెదిరింపులు కాకుండా.. కాల్పుల వరకు వచ్చింది. ఓ ఇద్దర్నీ సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపేందుక 5లక్షల సుపారీ ఇచ్చింది. ఇక అడ్వాన్స్‌గా లక్ష తీసుకున్న ఆ ఇద్దరు.. సల్మాన్‌ ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించి సినీ ఫక్కీలో కాల్పులు జరిపి పారిపోయారు. కానీ పోలీసులకు చిక్కి ఇప్పుడు జైలు పాలయ్యారు.

09.sharukh: కూతురి ఎంట్రీ కోసం 200 కోట్లు.?

బాలీవుడ్ బాద్‌ షా ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు. ఎందుకంటే తన కూతురు ఎంట్రీ కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేసుందుకు రెడీ అవుతున్నారు. సుజయ్‌ ఘోష్‌ డైరెక్షన్లో.. తన బేటీని హీరోయిన్‌గా కింగ్‌ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందుకోసం అందరూ షాకయ్యేలా ఏకంగా 200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మిస్తున్నారు బాద్‌షా..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!