AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ స్టార్ హీరోయిన్.. నాన్న తోప్ హీరో.. కానీ ఈ ముద్దుగుమ్మ హిట్స్ లేక అల్లాడిపోతోంది

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. స్టార్ కిడ్స్ అయినా కూడా అదృష్టం, టాలెంట్ లేకపోతే సక్సెస్ అవ్వడం చాలా కష్టం.. కొంతమంది టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాని హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ బ్యూటీ అమ్మ, నాన్న ఇద్దరూ స్టార్స్.. అయినా కూడా హిట్స్ కొట్టలేకపోతుంది.

అమ్మ స్టార్ హీరోయిన్.. నాన్న తోప్ హీరో.. కానీ ఈ ముద్దుగుమ్మ హిట్స్ లేక అల్లాడిపోతోంది
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2025 | 7:35 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఈ అమ్మడు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందంలోనూ అప్సరసే.. ఇంతకూ ఆమె ముద్దుగుమ్మ ఎవరో కాదు.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు శివాని  రాజశేఖర్. ఈ ముద్దుగుమ్మ 2స్టేట్స్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత తిరిగి తెలుగులో సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

2021లో వచ్చిన అద్భుతం అనే సినిమాలో నటించి మెప్పించింది. తేజ సజ్జ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ  అనే సినిమా చేసింది కానీ ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. అలాగే  మరోసారి తమిళ్ లో నెంజుక్కు నీతి అనే సినిమా చేసింది. ఆతర్వాత వరుసగా ‘శేఖర్‌’, కోట బొమ్మాళి పీ.ఎస్, విద్య వాసుల అహం అనే సినిమాలు చేసింది. కానీ ఈ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. దాంతో ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామ తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది.

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి