బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే 20ఏళ్లుగా హిట్స్ లేవు.. కానీ ఇప్పటికీ అదే క్రేజ్

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు సక్సెస్ అవ్వక పోతే ఖతం కనిపించకుండా మాయం అవుతుంటారు అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ అమ్మడు 20ఏళ్లుగా సరైన హిట్స్ లేక సతమతం అవుతుంది. అయినా కూడా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు..

బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే 20ఏళ్లుగా హిట్స్ లేవు.. కానీ ఇప్పటికీ అదే క్రేజ్
Actress

Updated on: Sep 03, 2025 | 1:51 PM

హిట్స్, ఫ్లాప్స్ అనేవి సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. కొంతమంది హీరోలు, హీరోయిన్స్ చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరికొంతమంది మాత్రం ఫ్లాప్స్ వస్తే కనిపించకుండా పోతారు. ముఖ్యంగా హీరోయిన్స్.. సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఐరెన్ లెగ్ అని ట్యాగ్ వేసేస్తారు. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయి.. క్రమంగా ఇండస్ట్రీలో కనిపించకుండాపోతారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ రూటే సపరేట్.. 20ఏళ్లుగా ఒక్క హిట్ అందుకోలేకపోయింది.. ఇరవై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇరవై ఏళ్లుగా హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అందంలో అప్సరస.. గ్లామర్ డోస్ కూడా ఎక్కువే.. కానీ అదృష్టం మాత్రం దక్కలేదు ఈ చిన్నదానికి.. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ వయ్యారి భామ చిత్రాంగదా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్రాంగదా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించి, అక్కడే పెరిగింది. బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది. 2005లో  హజారోన్ ఖ్వైషీన్ ఐసీ అనే క్రైమ్ డ్రామాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. హీరోయిన్ గానే కాదు నిర్మాతగానూ చేసింది. 2018లో సూర్మా అనే స్పోర్ట్స్ డ్రామాకు నిర్మాతగా వ్యవహరించింది. మొన్నామధ్య హౌస్‌ఫుల్ 5 సినిమాలోనూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

సినీ కెరీర్ లో చిత్రాంగదా సింగ్ తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్ చేసుకుంది. అలాగే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ లో నేను ఎన్నో తప్పులు చేశాను. నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నా.. గ్యాంగ్‌స్టర్ సినిమా నేను రిజెక్ట్ చేశా.. అంతే కాదు తను వెడ్స్ మను సినిమాను కూడా నేను మిస్ చేసుకున్నా.. మంగల్ పాండే’లో అమీషా పటేల్ చేసిన పాత్రను కూడా నేను రిజెక్ట్ చేశా.. అని తెలిపింది. సినిమాలు నిరాశపరిచినప్పటికీ   ఆమె నటనకు ఎప్పుడూ మంచి మార్కులే పడ్డాయి. కానీ కమర్షియల్‌గా పెద్ద హిట్స్ లేకపోవడం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారింది. ఇప్పటికి కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.