Shriya Saran: మనం సినిమాలో శ్రియ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరావు, కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అనుకుంది. అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే చివరి సినిమా. ఆయన వెళ్ళిపోతూ ఓ సూపర్ హిట్ సినిమాను మనకు అందించి వెళ్లిపోయారు. ఇక మనం సినిమాలో నాగచైతన్యకు జోడీగా సమంత నటించిన విషయం తెలిసిందే.. అలాగే నాగార్జునకు జోడీగా శ్రియ నటించింది.

Shriya Saran: మనం సినిమాలో శ్రియ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Manam
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 10, 2023 | 11:30 AM

అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని మెమరబుల్ హిట్ అంటే మనం సినిమా అనే చెప్పాలి. మూడు జనరేషన్ తో కలిపి ఓ చక్కని కథతో ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఏ జెనరేషన్ కు ఆ జనరేషన్ లవ్ స్టోరీతో అందమైన కథను రూపొందించాడు. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరావు, కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అనుకుంది. అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే చివరి సినిమా. ఆయన వెళ్ళిపోతూ ఓ సూపర్ హిట్ సినిమాను మనకు అందించి వెళ్లిపోయారు. ఇక మనం సినిమాలో నాగచైతన్యకు జోడీగా సమంత నటించిన విషయం తెలిసిందే.. అలాగే నాగార్జునకు జోడీగా శ్రియ నటించింది. అలాగే మూవీ చివరిలో అక్కినేని అఖిల్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇప్పుడు క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

ఈ మూవీలో నాగార్జునకు జోడీగా శ్రియ నటించింది. శ్రియ కన్నా ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట. కానీ ఆమె రిజక్ట్ చేయడంతో ఆ ఆఫర్ శ్రియకు వచ్చిందని తెలుస్తుంది. ఇంతకు ఆ క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదు ఆమె అనుష్క శెట్టి. అప్పటికే అనుష్క నాగార్జునతో కలిసి చాలా సినిమాల్లో నటించింది. సూపర్, డాన్, డమరుకం లాంటి సినిమాల్లో నటించింది.

నాగార్జున, అనుష్క జోడీకి మంచి క్రేజ్ ఉంది. మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా రాణించారు. అయితే మనం సినిమా కోసం అనుష్కను సంప్రదించారట అయితే అదే సమయంలో అనుష్క ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో ఆమె నో చెప్పారట. ప్రభాస్ తో  కలిసి మిర్చి సినిమా చేస్తుండటంతో మనం సినిమాకు నో చెప్పిందట అనుష్క. దాంతో ఆఫర్ శ్రియకు వచ్చిందట. మనం సినిమాతో శ్రియకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

అనుష్క శెట్టి 

శ్రియ ఇన్‌‌‌స్టా గ్రామ్ 

  నాగార్జున 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..