AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లోనే పాన్ వరల్డ్ మూవీ.. చైనాలో రికార్డులు తిరగరాసిన తెలుగు సినిమా..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హడావిడి కనిపిస్తుంది . చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి. అప్పట్లోనే చాలా సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అప్పట్లోనే పాన్ వరల్డ్ మూవీ.. చైనాలో రికార్డులు తిరగరాసిన తెలుగు సినిమా..
Movie
Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 7:39 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో 1950 ప్రాంతంలోనే పాన్ ఇండియా సినిమాకు మించిన సినిమాలు విడుదలయ్యాయి. వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో 1951లో విడుదలైన  మల్లీశ్వరి సినిమా ఒకటి. మహానటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), భానుమతిలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై 1951 డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినీ ధోరణిని మార్చి, ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఎన్టీఆర్, భానుమతిల నటనా వైభవానికి, వారి మధ్య కెమిస్ట్రీకి ఈ చిత్రం మచ్చుతునకగా నిలిచింది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఈ సినిమా కథ విషయానికొస్తే.. శ్రీకృష్ణదేవరాయలు హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో వీరాపురం అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. వస్త్రాలు నేయడంలో, శిల్పాలు చెక్కడంలో, ఆటపాటల్లో నైపుణ్యం కలిగిన వారు ఎక్కువగా నివసించే ఆ గ్రామంలో నాగరాజు (ఎన్టీఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి నుండి అన్యోన్యంగా పెరుగుతారు. వారి ప్రేమకు మల్లీశ్వరి తల్లి భూష్యేంద్రమణి అడ్డుపడి, మల్లీశ్వరిని రాణివాసానికి పంపిస్తుంది. తనను తాను నిరూపించుకోవడానికి నాగరాజు సంపాదన కోసం బయలుదేరి, తిరిగి వచ్చేసరికి మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లిన విషయం తెలుసుకుని విరహంతో దేశం విడిచి తిరుగుతాడు. శిల్పకళలో తన ప్రతిభతో పేరు సంపాదించి, శ్రీకృష్ణదేవరాయల వసంత మండపం నిర్మాణానికి ప్రధాన శిల్పిగా నియమించబడతాడు. అక్కడ అతను చెక్కిన శిల్పాల్లో మల్లీశ్వరి పోలికలను గుర్తించిన ఆమె, నాగరాజును రహస్యంగా కలుస్తుంది. చివరకు రాణి తిరుమలాంబ మధ్యవర్తిత్వంతో రాయలు వీరి ప్రేమ త్యాగాలను గుర్తించి క్షమిస్తారు. ఈ కథలోని మలుపులు, భావోద్వేగ ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

ఈ సినిమాకు కథతో పాటు మూవీలో ఉన్న 17 పాటల్లో 16 పాటలను దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రాశారు. ఈ పాటలకు సాలూరు రాజేశ్వరరావు అందించిన సంగీతం సినిమాకు మరింత ప్రాణం పోసింది. నెల రాజా, వెన్నెల రాజా, మనసున మల్లెల మాలలు గానే, అవునా నిజమేనా వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. మల్లీశ్వరి పాత్రకు భానుమతిని, నాగరాజు పాత్రకు ఎన్టీఆర్‌ ప్రాణం పోశారు. 1951 డిసెంబర్ 20న విడుదలైన మల్లీశ్వరి అప్పట్లో 13 కేంద్రాల్లో 71 రోజులు ఏకధాటిగా ప్రదర్శితమైంది. ఇది కేవలం దేశీయంగానే కాకుండా, చైనాలో సబ్‌టైటిల్స్‌తో విడుదలై 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా అంతర్జాతీయ రికార్డును నెలకొల్పింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై దేశ, విదేశీయుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా