Sai Pallavi : సాయి పల్లవి అసలు పేరు ఇదే..? ఈ అమ్మడికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా.?
తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఫిదా సినిమాలో తెలంగాణ యువతిగా కనిపించిన సాయి పల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత వరుసగా ఈ చిన్నదానికి అవకాశాలు వచ్చాయి. అయితే గ్లామర్ పాత్రలకు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పిస్తుంది ఈ చిన్నాది.

సాయి పల్లవి నటనకు అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు పేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఫిదా సినిమాలో తెలంగాణ యువతిగా కనిపించిన సాయి పల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత వరుసగా ఈ చిన్నదానికి అవకాశాలు వచ్చాయి. అయితే గ్లామర్ పాత్రలకు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పిస్తుంది ఈ చిన్నాది. అయితే ఈ మధ్యకాలంలో సడెన్ గ సైలెంట్ అయ్యింది. కొత్త సినిమాలు అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యింది. దాంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
సాయి పల్లవి పెళ్లి చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరు ఆమె డాక్టర్ గా సెటిల్ అవ్వనుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్తుంది అంటూ వార్తలు పుట్టించారు. దాంతో ఆమె అభిమానులు అవాక్ అయ్యారు. అటు సాయి పల్లవి కూడా ఈ వార్తల పై స్పందించకపోవడంతో ఈ గుసగుసలు మరింత ఎక్కువయ్యాయి.
కానీ ఇప్పుడు సాయి పల్లవి తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈవీడియోలో సాయి పల్లవి తన పర్సనల్ విషయాలను పంచుకుంది., తన అసలు పేరు, హైట్, వెయిట్, ఎన్ని భాషలు మాట్లాడుతుంది ఇలా చాలా విషయాలను పంచుకుంది. సాయి పల్లవి అసలు పేరు సాయి పల్లవి సింతామరై .. పుట్టిన తేదీ – 9/05/1992 ఆమె హైట్- 5.4 అడుగులు, వెయిట్ – 52, క్వాలిఫికేషన్ – డాక్టర్ , డాన్సర్, యాక్టర్, మాట్లాడే భాషలు – తమిళ్, తెలుగు, ఇంగ్లిష్, మలయాళం, కన్నడ ( అర్ధమవుతుంది), హిందీ, జార్జియం, బడగా ( మాతృ బాష) అని తెలిపింది సాయి పల్లవి. మొత్తంగా ఈ చిన్నదనికి ఎనిమిది భాషలు వచ్చు.
సాయి పల్లవి వీడియో..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




