Nellore Neeraja : చాలా అవమానించారు.. నన్ను ఎగతాళి చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న నెల్లూరు నీరజ
ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చారు నెల్లూరు నీరజ. ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లో , వెబ్ సిరీస్ లలో కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా తో కలిసి పలు కామెడీ షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి నవ్వించారు.

చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఎలాగైనా ఇండస్ట్రీలో ఎలా గోలా రాణించాలని చాలా మంది చూస్తుంటారు. కొందరికి అదృష్టం కలిసొచ్చి అవకాశాలు వస్తాయి.. కానీ కొంత మంది మాత్రం ఎంత ట్రై చేసినా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోలేరు. ఇదిలా ఉంటే నెల్లూరు నీరజ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. చిన్న చిన్న వెబ్ సిరీస్ లలో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నెల్లూరు నీరజ. ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చారు నెల్లూరు నీరజ. ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లో , వెబ్ సిరీస్ లలో కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా తో కలిసి పలు కామెడీ షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి నవ్వించారు.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఓ వీడియోను షేర్ చేసిన ఆమె అందులో కన్నీళ్లతో కనిపించారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే నెల్లూరు నీరజ ఎమోషనల్ అవ్వడం కన్నీళ్లు పెట్టుకోవడంతో నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇంతకు నెల్లూరు నీరజా ఎందుకు ఎమోషనల్ అయ్యిందో తెలుసా..
తాజాగా నెల్లూరు నీరజ షేర్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అయ్యింది. ఈ 13 ఏళ్లల్లో మాగ్జిమమ్ అన్ని షోలు చేశాను. చాలా కామెడీ పాత్రల్లో నటించా.. టీవీ షోలు, వెబ్ సిరీస్ లు , సీరియల్స్ లోనూ నటించా.. కానీ సినిమాల్లో ఛాన్స్ మాత్రం అందుకోలేకపోయాను. సినిమాల్లో కనిపించకుండానే చనిపోతానని అనుకున్నా కానీ నాకల నెరవేరింది అని తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో నటించాను కానీ అవి అంతగా చెప్పుకోదగ్గవి కాదు. దాంతో ఓ చిన్న వెలితి ఉండిపోయింది. కానీ ఇప్పుడు సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌లో ఆయనకు మేనత్తగా చేశాను. ట్రైలర్ లో నన్ను నేను చూసుకుంటే నా 13ఏళ్ల కష్టం ఇట్టే పోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు నీరజ. చాలా అవమానాలు పడ్డాను, చాలా మంది నను ఎగతాళి చేశారు. నా పనైపోయింది అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు నేను సిద్దూ సినిమాలో నటించా.. నాకు ఛాన్స్ ఇచ్చిన సిద్దూ కి చాలా థ్యాంక్స్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు నీరజ.
నెల్లూరు నీరజ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
టిల్లు స్క్వేర్ ట్రైలర్
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




