Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పు.. ఈ రోజు తులం ఎంత పెరిగిందంటే..?
బంగారం, సిల్వర్ ధరలు గత కొద్దిరోజులుగా ఊహించని స్ధాయిలో పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వారంలో అందనంత ఎత్తుకు గోల్డ్ చేరుకుంటోంది. రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇక బంగారంకు పోటీగా వెండి ధర కూడా అంతకంతకు పెరుగుతోంది.

దేశంలో బంగారం ధరల పెరుగుదుల కొనసాగుతూనే ఉంది. పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. రోజురోజుకి పెరుగుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. సోమవారం నుంచి భారీ స్థాయిలో పెరుగున్న గోల్డ్ రేటు.. గురువారం కూడా ఆకాశాన్నంటింది. ఇవాళ కూడా మారోసారి బంగారం రేట్లు పెరిగాయి. గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
నేడు బంగారం ధరలు ఇలా..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,38,940 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,38,930 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,360 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,27,3501గా ఉంది.
-విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,38,940గా ఉండగా.. 22 క్యారెట్లు వచ్చి రూ.1,27,360గా ఉందని చెప్పవచ్చు.
-విశాఖపట్నంలో 24 క్యారెట్లు రూ.1,38,940గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,27,3601 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,38,940 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,360 వద్ద కొననసాగుతోంది.
-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఇది రూ.1,39,640 వద్ద స్ధిరపడింది
వెండి ధరలు
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,44,100గా ఉంది
-బెంగళూరులో కేజీ వెండి రూ.2,33,100గా ఉంది
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,44,100 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి
