AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబోలో మిస్ అయిన సినిమా ఏమిటో తెలుసా..

పవన్ కళ్యాణ్ చాలా మంది హీరోయిన్లతో నటించారు. వీరిలో చాలా మంది ఫేడ్ అవుట్ అయ్యారు. మరికొందరు అసలు అడ్రస్ కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ తో సౌందర్య ఓ సినిమా చేయాల్సి ఉందట. ఈ కాంబోలో సినిమా ఓకే అనుకున్నారు కూడా.. అయితే పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయిందట.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబోలో మిస్ అయిన సినిమా ఏమిటో తెలుసా..
Pawan Kalyan
Surya Kala
|

Updated on: May 02, 2025 | 3:22 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజిబిజిగా ఉన్నారు. మంత్రిగా తన విధులను నిర్వహిస్తూ ప్రజల కష్టాలను తీరుస్తూ తనదైన శైలిలో ఉప ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తున్నారు. అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నాడు. మొదట సినిమాలో లెజండరీ యాక్టర్ ఎన్నార్ మనవరాలు సుప్రియతో నటించారు.. తర్వాత రాశీ, రేణు దేశాయ్‌, దేవయాని, అమిషా పటేల్‌, . కాజల్, సమంత, శృతి హాసన్‌, తమన్నా, కీర్తిసురేష్‌, వంటి అనేక మంది హీరోయిన్లతో నటించాడు. వీరిలో కొంతమంది ఫేడ్ అవుట్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్.. సౌందర్య కంబోలో ఓ సినిమా చేయాల్సి ఉందట. ఆ సినిమా పవన్ కెరీర్ లో డిఫరెంట్ సినిమాగా నిలిచింది. యూత్ కు ప్రేమ కంటే తల్లిదండ్రులు లక్ష్యం ముఖ్యం అని తెలియజే సినిమా అదే భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సుస్వాగతం.

ఈ సినిమాలో మొదట ఎంపిక దేవయాని కాదట. ముందుగా దర్శకుడు సౌందర్య అకున్నాడట. అయితే అప్పటికే సౌందర్యకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడే హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు మూడో సినిమా మాత్రమే. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్.. పవన్ కళ్యాణ్ కెరీర్ కి ఓ బూస్టర్ వంటిది. ఈ సినిమా తర్వాత పవన్ వరసగా హిట్స్ అందుకుని తిరుగులేని స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎక్కువగా కలిసి ఉండరు. తండ్రి చాటు బిడ్డగా మంచి ఉద్యోగమే లక్ష్యంగా సాగిపోయే హీరోయిన్ సంధ్య.. ను హీరో గణేష్ ఇష్టపడతాడు. ఆమె ప్రేమ కోసం నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో తండ్రిని కడసారి కూడా చూసుకోలేక పోతాడు. అప్పుడు ప్రేమ కంటే జీవితం ఇంకా గొప్పదని తనని తాను మార్చుకుని ఓ లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేస్తాడు. ఈ సినిమాలో హీరో ప్రేమ కోసం పడే తపన.. చివరికి రిలైజ్ అయిన తీరు అప్పట్లో యువతని బాగా ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే హీరోలో తమని తాము యూత్ చూసుకుంది. అటువంటి గణేష్ పాత్రలో పవన్ తనదైన శైలిలో నటించి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక సంధ్యగా సౌందర్యని అంటే పవన్‌కి జోడీగా సౌందర్య అయితే బాగా సెట్‌ అవుతుందని దర్శకుడు అనుకున్నారట. అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న పవన్ హీరోయిన్ గా సౌందర్య వద్దు అని చెప్పడంతో చేసేది ఏమీ లేక ఆ ప్లేస్ లో అప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకుంటున్న దేవయానిని తీసుకొచ్చారు. ఇలా దేవయాని.. పవన్‌ కాంబోలో సినిమా తెరకెక్కింది. పవన్ డామినేషన్‌ పనిచేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

అలా ఒక మంచి కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. ఈ అరుదైన కాంబోలో సినిమా తెరకెక్కి ఉంటే ఎప్పటికీ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ లా ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. సుస్వాగతం సినిమా తర్వాత వరస హిట్స్ తో పవన్ కేరేర్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ .. . ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలు చేయాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..