అప్పట్లో రూ.5 లక్షలు అందుకుంది.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ.5కోట్లు తీసుకుంటుంది..
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకంటున్నారు. ఒక సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నది తొలి సినిమాకు రూ. 5 లక్షలు అందుకుంది. ఇక ఇప్పుడు రూ. కోట్లు అందుకుంటుంది.

ఇప్పుడున్న హీరోయిన్స్ కు ఆఫర్స్ తోపాటు రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువే.. ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి వరుసగా సినిమా ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. అంతే కాదు స్టార్ డమ్ పెరగడం తో రెమ్యునరేషన్ కూడా విపరీతంగా పెంచేస్తున్నారు. కొంతమంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో పైన కనిపిస్తున్న చిన్నది ఒకరు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ ఈ అమ్మడు. తనతో డాన్స్ చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆలోచిస్తారు. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది. కానీ ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం భారీగా ఉంది.
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? కెరీర్ బిగినింగ్ లో సినిమాకు రూ. 5లక్షలు రెమ్యునరేషన్ అందుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు ఏకంగా ఒకొక్క సినిమాకు రూ. 5 కోట్ల వరకు అందుకుంటుంది ఈ స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇంతకూ ఆమె ఎవరంటే యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఈ భామ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక్కడ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే అందరు స్టార్ హీరోల సరసన నటించింది.
తెలుగులో ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ భామ. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజలాంటి స్టార్ హీరోలతో పాటు.. టాలీవుడ్ యంగ్ హీరోలతోనూ నటించింది. తోలి సినిమా కన్నడ మూవీ కిస్ కు రూ. 5 లక్షలు తీసుకుంది. ఇక ఇప్పుడు ఒకొక్క సినిమాకు దాదాపు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ లోనూ మెప్పిస్తుంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. శ్రీలీల ముగ్గురు అనాధ పిల్లలను దత్తాత తీసుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




