Tollywood: 3 ఏళ్లకే సింగర్.. 10వేలకుపైగా పాటలు.. 37 ఏళ్లకే మరణం.. ఎవరో తెలుసా ?
చిన్న వయసులోనే గాయనిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. దాదాపు 10వేలకు పైగా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి శ్రోతల హృదయాలను గెలుచుకుంది. 1987లో తన ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. కానీ 37 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్ అంటే లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, శ్రేయ ఘోషల్ పేర్లు గుర్తుకు వస్తాయి. ఇక దక్షిణాది అంటే మాత్రం శ్రీమతి సుబ్బులక్ష్మి, ఎస్ జానకి, కెఎస్ చిత్ర పేర్లు తెరపైకి వస్తాయి. అలాగే ఎంతో మంది యువ గాయనీగాయకులు సైతం తమ అద్భుతమైన గాత్రంతో స్వరాలతో ప్రజలను అలరించారు. కానీ చాలా తక్కువ సమయంలోనే వేలాది పాటలు పాడిన సింగర్ గురించి తెలుసా.. ? ఆమె అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఈ గాయని పేరు నేటి ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఈతరం శ్రోతలను మైమరపిస్తాయి. ఆమె మరెవరో కాదు.. స్వర్ణలత. ఆమె కెరీర్ పెద్దగా లేదు, కానీ సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషి గొప్పది.
1973 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు స్వర్ణలత. ఆమె 3 సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించింది. తన సోదరి వద్ద శిక్షణ తీసుకుంది. ఆమె 1987లో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకు కేవలం 14 సంవత్సరాలు. కానీ ఆ గాయని ఇంత చిన్న వయసులోనే సంగీతాన్ని నేర్చుకుంది. 22 సంవత్సరాల కెరీర్‌లో ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలలో 10 వేలకు పైగా పాటలు పాడింది. ఆమె ఇళయరాజా నుండి ఎ.ఆర్. రెహమాన్ వరకు దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడింది. కె.జె. యేసుదాస్ నుండి శంకర్ మహదేవన్ వరకు అందరితో కలిసి ఆమె ప్రదర్శనలు ఇచ్చింది.
రెండు దశాబ్దాల తన కెరీర్‌లో ఈ గాయని అనేక అవార్డులను గెలుచుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతానికి గాను స్వర్ణలత జాతీయ అవార్డును గెలుచుకుంది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, తమిళనాడు రాష్ట్ర అత్యున్నత పురస్కారం కలైమామణి అందుకుంది. ఇంత ఉన్నత స్థాయి గాయని ఇంత త్వరగా చనిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. దక్షిణ భారత గాయని స్వర్ణలతకు ఇడియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి ఆమె చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




