Dhanush: ధనుష్ కంటే ముందే బెగ్గర్ పాత్రకు ప్రాణం పోసిన టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా..
చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ కుబేర. అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. విభిన్నమైన శైలి.. వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై మాయ చేయడంలో ఆయన ప్రత్యేకం. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ ప్రేమకథ తర్వాత ఇప్పుడు భిన్నమైన కథాంశంతో అడియన్స్ ముందుకు వచ్చారు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ కుబేర. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది. జూన్ 20న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇందులో ధనుష్, నాగార్జున యాక్టింగ్ వేరేలెవల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్.
ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఇందులో బిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ బిలినీయర్ పాత్రలో కనిపించగా.. మంచి చెడుల మధ్య నలిగిపోయే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కుబేర సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెగ్గర్ పాత్ర కోసం ధనుష్ చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఎంతో శ్రమించి షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బిచ్చగాడి పాత్ర కోసం ధనుష్.. చిరిగిపోయిన దుస్తులు, మాసిన జుట్టు, గడ్డంతో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందులో దేవా పాత్రలో ధనుష్ జీవించేశారనే చెప్పాలి. అమాయకత్వం, మంచితనం ఉన్న పేదవాడి పాత్రను అద్భుతంగా పోషించారు.
ఈ సినిమాలో ధనుష్ నటనకు జాతీయ అవార్డ్ రావడం ఖాయమంటూ రివ్యూస్ ఇస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే కుబేర సినిమాలో ధనుష్ పాత్రను పోషించే తెలుగు హీరో లేడంటూ నెట్టింట సరికొత్త చర్చ తీశారు. అయితే మరికొందరు మాత్రం ధనుష్ కంటే ముందే ఓ తెలుగు హీరో బిచ్చగాడు పాత్రకు ప్రాణం పోశాడంటూ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. అతడు మరెవరో కాదు.. అల్లరి నరేష్. 18 సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లయింది కానీ.. ! సినిమాలో బెగ్గర్ పాత్రలో కనిపించారు నరేష్. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం షేర్ చేస్తున్నారు.
@dhanushkraja Anna Chesadu Accepted huge Respect 🙏🏻 but Telugu lo Evaru cheyaledu ani Anakandra idhi @allarinaresh Anna eppudo chesadu Inka Aapandi Mee Rudhudu 😫#AllariNaresh #Kuberaa #Dhanush pic.twitter.com/OKzLfYoqbH
— Sunnysalaarᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ 🚩 (@GDKRebels) June 20, 2025
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..








