Chandramukhi: తెలుగులో చంద్రముఖి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చివరకు..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం చంద్రముఖి. తమిళంతోపాటు తెలుగులోనూ ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ మీకు తెలుసా.. ? ఈ మూవీకి రజినీకాంత్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆయన కంటే ముందు ఓ టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. ఇంతకీ అతడు ఎవరంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. 2005లో విడుదలైన ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. బి. వాసు దర్శకత్వం వహించిన ఈ హర్రర్ కామెడీ చిత్రంలో నయనతార, జ్యోతిక, ప్రభు, వడివేలు, వినీత్, నాజర్ కీలకపాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 20 ఏళ్ల క్రితమే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కామెడీ, సస్పెన్స్, యాక్షన్, హారర్ వంటి అంశాలతో సాగిన ఈ మూవీ ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ హారర్ కామెడీ డ్రామాకు ముందుగా అనుకున్న హీరో రజినీకాంత్ కదట. ఈ సినిమా కథను సూపర్ స్టార్ రజినీ తన స్నేహితుడు ప్రభు కోసం నటించారట. ప్రభు ఆర్థిక కష్టాల్లో ఉంటే రజనీ అందులో నటించాడట. డైరెక్టర్ వాసు చెప్పిన కథ విన్న ప్రభు.. ఈ సినిమాకు రజినీ పేరును సూచించారట. తమిళ నటుడు ప్రభు సలహా మేరకే తాను ఈ కథను రజినీకాంత్ కు చెప్పానని.. ఆ వెంటనే రజినీ అంగీకరించారని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విజయం రజినీ కెరీర్ మరో మలుపు తిరిగింది. అప్పటికే స్టార్ డమ్ సంపాదించుకున్న రజినీ ఈ మూవీతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారట. ఇక హీరోగా మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించగా.. ఈ సినిమా చేసేందుకు ఆయన అంతగా ఆసక్తి చూపించలేదని టాక్.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించి మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పారట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో తమిళ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. . చంద్రముఖి సినిమాతో నయనతారకు స్టార్ డమ్ వచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..




